అంగన్వాడీ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి

యాదాద్రి భువనగిరి సెప్టెంబర్ 21(ఇయ్యాల తెలంగాణ ):అంగన్వాడీ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలుచేసి వారి సమస్యలను పరిష్కరించాలని బహుజన్‌ సమాజ్‌  పార్టీ నకిరేకల్‌ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నకిరేకల్‌ మునిసిపల్‌  చౌరస్తాలో  అంగన్వాడీ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరిన సందర్బంగా బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఆధ్వర్యంలో పాల్గోని దీక్షకు తమ సంఫీుభావం, పూర్తి మద్దతును తెలిపారు. ఈసందర్బంగా మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ అంగన్వాడీ కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.గత ఎన్నికల ముందు బి ఆర్‌ ఎస్‌  ప్రభుత్వం తెలంగాణ లొ మళ్ళీ అధికారంలొకి వస్తే గ్రామపంచాయతీ సిబ్బంది, కాంట్రాక్టు, ఔట్సోరిసింగ్‌, అంగన్వాడీ ఉద్యోగులను ఒక్క సంతకంతో పర్మినెంట్‌ చేస్తామని ప్రగల్బాలు పలికి నేడు అదే కేసీఆర్‌ హావిూలను అమలుచేయకుండ రోడ్డున పడేసే ప్రయత్నం చేస్తున్నడని కేసీఆర్‌ మెడలు వంచి హక్కులను సాధించేవరకు ఆగేది లేదని తెలిపారు. బహుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్‌ ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సర్‌ అంగన్వాడీ కార్మికుల సమ్మెకు మద్దత్తు తెలిపారని తాము అధికారంలొకి వస్తే మొదటి సంతకంతోనే అన్ని రంగాల్లో వివిధ హోదాల్లో పనిచేసే కార్మికులందరిని పర్మినెంట్‌ చేస్తామని హావిూ ఇచ్చి మోసం చేసిన కేసీఆర్‌ దొరల పాలనను  గద్దెదించి సమిష్టిగా బహుజన రాజ్యం తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్‌, కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్‌,యోగి, మహేష్‌,సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు వంటెపాక వెంకటేశ్వర్లు, అంగన్వాడీ టీచర్‌ హెల్పర్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు పొడిశెట్టి నాగమణి, అరుణ, శోభ, చంద్రమ్మ, శుభాషిణి, జయమ్మ, లతిఫ, మంగ, లక్ష్మి, వెంకటమ్మ బి ఎస్‌ పి నాయకులు కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....