అంగన్వాడీ కేంద్రంలో బాలల దినోత్సవ వేడుకలు

పిల్లల తల్లులకు పోషక విలువలపై అవగాహన

కోరుట్ల నవంబర్‌ 14 (ఇయ్యాల తెలంగాణ) : కోరుట్ల పట్టణ ఐబి రోడ్‌ లోని ఒకటవ అంగన్వాడి కేంద్రంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 32వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో నమోదు కావలసిన ఎస్‌ఏఎం అండ్‌ ఎంఏఎం పిల్లలకు ఇచ్చే అదనపు పోషకాహారమును తల్లిదండ్రుల సమక్షంలో తినిపించి పోషక ప్రాముఖ్యతను వివరించారు. పిల్లలను ప్రతి నెల బరువు తూయటం ద్వారా పిల్లల పోషణ స్థితిగతులు తెలుసుకోవచ్చని తల్లులకు గ్రీన్‌ కార్డు గురించి వివరిస్తూ వారికి పోషకలోప నివారణకు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 32వ వార్డు కౌన్సిలర్‌ జిందం లక్ష్మీనారాయణ, సూపర్వైజర్‌ ప్రేమలత, అంగన్వాడీ టీచర్‌ బదర్‌ సుల్తానా, ఆయా వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....