అంగరంగ వైభవంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబురాలు

 

హైదరాబాద్, అక్టోబర్ 4 (ఇయ్యాల తెలంగాణ) : శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా తొమ్మిదో రోజు పూజలు అత్యంత కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకల్లో చిన్నారులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో బతుకమ్మ లను ఏర్పాటు చేసుకొని తమ వీధిలోనే కొలను ఏర్పాటు చేసుకొని అందులో బతుకమ్మలను వేస్తున్నారు. ఇందులో భాగంగా  సికింద్రాబాద్ తార్నాక లో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటెన్ లో చుట్టు ప్రక్కల ప్రాంతాలలోని బతుకమ్మలను తెచ్చి ఈ కొలనులో నిమజ్జనం చేస్తున్నారు. ఈ వేడుకలో తెరాస పార్టీ నాయకులు రాజేష్ పెద్దన్న సకుటుంబ సమేతంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....