అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం

సనత్‌నగర్‌ జూన్‌ 20 (ఇయ్యాల తెలంగాణ) :  బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. ఉదయం 9.30 గంటలకు ఈ కల్యాణోత్సవం ప్రారంభమైంది. ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని ప్రజలు టీవీల్లో వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకునేలా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఏటా ఆషాడ మాసం మొదటి మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. కల్యాణానికి ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబసమేతంగా హాజరై పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా, అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా భక్తులు భారీగా కల్యాణోత్సవానికి విచ్చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.అయితే, బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం ఘనంగా ఎదుర్కోళ్లు నిర్వహించారు. ఇవాళ అంగరంగ వైభవంగా ఎల్లమ్మ కల్యాణం చేస్తున్నారు. చివరిగా రేపు సాయంత్రం రథోత్సవం నిర్వహిస్తారు. అంతటితో అమ్మవారి కల్యాణోత్సవాలు ముగుస్తాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....