అందుబాటులోకి.. రైతు భరోసా యాప్‌.. – Trail పూర్తి

హైదరాబాద్‌, ఆగష్టు 27 (ఇయ్యాల తెలంగాణ) : రైతు వివరాల ఎంట్రీ సమయంలో మూడు రకాల ఇబ్బందులు మాఫీ కాని రైతుల నుంచి ఫ్యామిలీ అఫిడవిట్‌ తీసుకోనున్న ఆఫీసర్లు మంగళవారం యాప్పై ప్రిన్సిపల్‌ సెక్రటరీ, అగ్రికల్చర్‌ డైరెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ బ్యాంకర్లు, ఆఫీసర్ల పొరపాట్ల వల్ల రుణమాఫీలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు రైతు భరోసా యాప్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్రయల్‌ పూర్తి కాగా, యాప్లో చేయాల్సిన మార్పు, చేర్పులపై మంగళవారం అన్ని జిల్లాల వ్యవసాయాధికారులతో ప్రిన్సిపల్‌ సెక్రటరీ, అగ్రికల్చర్‌ డైరెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. వీసీలో వచ్చిన సూచనలు, సలహాల మేరకు యాప్లో మార్పులు చేర్పులు చేయనున్నారు.

మొదట ఫ్యామిలీ గ్రూపింగ్‌:

రాష్ట్ర సర్కారు రూ. 2 లక్షలలోపు లోన్లు తీసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు పంద్రాగస్టులోపు రూ.2 లక్షలలోపు లోన్లు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేసింది. కానీ కొన్ని టెక్నికల్‌ సమస్య వల్ల  చాలా మందికి రుణాలు మాఫీ కాలేదు. 31 రకాల ఇబ్బందుల వల్ల చాలా మందికి లోన్లు మాఫీ కాలేదని అగ్రికల్చర్‌ ఆఫీసర్లు గుర్తించి, ఆ రిపోర్టును ఇటీవల రాష్ట్ర సర్కారుకు అందించారు.

ఇందులో ప్రధానంగా రేషన్‌ కార్డల్లో కుటుంబ సభ్యుల వివరాలు తప్పుగా ఉండడం, అర్హుల పేర్లు రేషన్‌ కార్డుల్లో ఒకలా, ఆధార్‌ మరోలా ఉండడం.. ఆధార్‌ నంబర్లు తప్పుగా పడడం, అర్హుల పేర్లు ఆధార్లో ఒకలాగా, బ్యాంక్‌ అకౌంట్లో మరో లా పడడం లాంటి సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు రాష్ట్ర సర్కారు తొమ్మిది రోజుల్లోనే భరోసా యాప్‌ ను అందుబాటులోకి తెచ్చింది. మొదట యాప్లో రుణమాఫీ కాని రైతు కుటుంబ సభ్యుల వివరాలను ఫ్యామిలీ గ్రూపింగ్‌, ఎంట్రీ చేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు గత శనివారం రాష్ట్రంలోని అన్ని మండలాల వ్యవసాయాధికారులు యాప్‌ ను డౌన్లోడ్‌ చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వారి ఆదేశానుసారం యాప్‌ ను డౌన్లోడ్‌ చేసుకున్న మండల వ్యవసాయధికారులు. సర్కారు సూచనలు మేరకు  ట్రయల్‌ నిర్వహించారు. ప్రతి మండలంలోని ఒక రైతు కుటుంబ వివరాలు ఎంట్రీ చేశారు.

బ్యాంకర్ల నుంచి వివరాల సేకరణ..

రుణమాఫీ కాని రైతుల వివరాలు మండల వ్యవసాయాధికారులకు అందజేయాలని రాష్ట్ర సర్కారు బ్యాంకర్లను ఆదేశించింది. దీంతో వారు రుణాలు మాఫీ కాని వివరాలను రెడీ చేసి మండల వ్యవసాయధికారులకు అప్పగించే పనిలో ఉన్నారు. ఒకటి రెండో రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. బ్యాంకర్లు ఇచ్చిన వివరాల ఆధారంగా యాప్‌ లాగిన్‌ ఉన్న మండల వ్యవసాయధికారులు ప్రతి గ్రామంలో పర్యటించనున్నారు. లిస్టులో ఉన్న పేర్ల ఆదారంగా ప్రతి రైతు ఇంటి వద్దకు వెళ్లి యాప్లో వివరాలు నమోదు చేయనున్నారు.

అఫిడవిట్‌ తప్పనిసరి:

జనరల్‌ ట్రాన్స్ఫర్స్లో భాగంగా అగ్రికల్చర్‌ డిపార్ట్మెంట్లో ఇటీవల చాలా మంది ఆఫీసర్లు ఒక మండలం నుంచి మరో మండలానికి బదిలీ అయ్యారు. ఈ క్రమంలో కొత్తగా మండలానికి వచ్చిన ఆఫీసర్లకు ఎంక్వైరీ సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు రైతుల నుంచి ఫ్యామిలీ అఫిడవిట్లు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు రుణమాఫీ కాని రైతు తమ కుటుంబంలో ఎంత మంది ఉన్నారు? అనే వివరాలతో ఫ్యామిలీ అఫిడవిట్ను పంచాయతీ సెక్రటరీ లేదా గెజిటెడ్‌ ఆఫీసర్‌ సిగ్నేచర్‌ తో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెటు ను సర్వేకు వచ్చే ఆఫీసర్‌ కు అందించాల్సి ఉంటుంది. వారు ఈ సర్టిఫికెట్‌ ఫొటోలు తీసి, యాప్లో అప్లోడ్‌ చేస్తారు. ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రానున్నాయి.

ఎంట్రీ సమయంలో ఆఫీసర్లకు మూడు రకాల ఇబ్బందులు,

ఒక మండలానికి చెందిన రైతు ఆ మండలంలోని బ్యాంకులో కాకుండా మరో మండలంలోని బ్యాంకులో క్రాప్‌ లోన్‌ తీసుకొని ఉంటే యాప్లో ఆ రైతు వివరాలు ఎంట్రీ కావడం లేదు.

యాప్లో రిలేషన్స్‌ ఆప్షన్లో కూతురు, కుమారుడు పేర్లు మాత్రమే డిస్ప్లేలో ఉన్నాయి. దీని వల్ల కోడళ్లు, అల్లుళ్లు, మనువళ్లు, మనుమరాండ్లు, నాన్నమ్మ, తాతయ్య వంటి పేర్లు ఎంట్రీ చేయడానికి ఇబ్బందులు వస్తున్నాయి.

భర్త పేరు విూద భూమి ఉండి ఆయన చనిపోతే ఆధార్‌ నంబర్‌ లేకపోవడం.. భార్య పేరు విూద భూమి ఉండి ఆమే చనిపోతే ఆధార్‌ నంబర్‌ లేకపోతే యాప్లోవివరాలు ఎంట్రీ కావడం లేదు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....