హైదరాబాద్ సెప్టెంబర్ 22 (ఇయ్యాల తెలంగాణ ):బీజేపీ కి సీనియర్ నేత రాజీనామా చేసారు. మాజీ గ్రేటర్ పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి బిజెపి పార్టీలో అవమానాలు భరించలేక పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. బిజెపి పార్టీకి గత 43 సంవత్సరాలుగా పని చేసిన నాకు సరైన గుర్తింపు రాకపోవడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ కంటతడి పెట్టారు. అంబర్పేట బిజెపి సీనియర్ నాయకులు, మాజీ గ్రేటర్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి బాగ్ అంబర్ పేట్ కార్పొరేటర్ పద్మావతి రెడ్డితో కలిసి ఆయన పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్ లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. పార్టీకి రాజీనామా చేస్తూ నేను ఎవరిని నిందించడం లేదు. గతంలో రెండు సార్లు గ్రేటర్ అధ్యక్షుడిగా పనిచేసి మరో రెండు సార్లు మలక్పేట బిజెపి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఈసారి అంబర్పేట అసెంబ్లీ సీటు ఆశించినట్లు తెలిపారు. ఇదే విషయంపై కిషన్ రెడ్డిని ఎన్నిసార్లు కలవడానికి ప్రయత్నించిన కిషన్ రెడ్డి కలవడానికి నిరాకరించారని అన్నారు
- Homepage
- Telangana News
- అంబర్పేట BJPలో భారీ షాక్
అంబర్పేట BJPలో భారీ షాక్
Leave a Comment