అగ్గిపెట్టలో పట్టు చీర..Kanaka దుర్గమ్మకు సమర్పణ

ఇంద్రకీలాద్రి, మే 14 (ఇయ్యాల తెలంగాణ) : బుధవారం నాడు రోజు ఉదయం శ్రీ కనక దుర్గమ్మ వారికి చేనేత కార్మికులైన భక్తులు అగ్గిపెట్టె లో పట్టు చీర సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల వాస్తవ్యుడైన చేనేత కళాకారుడు నల్ల విజయ్‌ కుమార్‌,  తండ్రి నల్ల పరంధాములు వారసత్వానికి పునికి పుచ్చుకొని చేనేత కళారంగంలో అగ్గిపెట్టలో చీర మరియు శాలువను, కుట్టు లేకుండా లాల్చి పైజామా మరియు జాతీయ జెండాను అంతేకాకుండా మూడు కొంగుల చీరను మరియు ఊసరవెల్లిలా రంగులు మార్చే చీర మరియు సుగంధ ద్రవ్యాల సువాసన వచ్చే చీర, దబ్బనంలో దూరిపోయే చీర, బంగారం, వెండి చీరలు రూపొందించిన అద్భుతమైన కళాకారుడు.

 ఈ చేనేత కుటుంబం ప్రతి రెండేళ్లకోసారి వారి ఇంటి  ఇమిడే పట్టు చీర తయారుచేసి అమ్మవారికి అందించడం జరిగినది.  చీర బరువు100 గ్రాములు, దీని పొడవు ఐదున్నర విూటర్లు మరియు వెడల్పు 48 ఇంచులు.  దీనిని పూర్తిగా పట్టు దారాలతో మరియు గోల్డ్‌ జరి వాడడం జరిగిందని, దీనిని తయారు చేయడానికి సమయం సుమారుగా ఐదు రోజులు పట్టిందని నల్ల విజయ్‌ కుమార్‌  తెలిపారు.

ఆలయ కార్యనిర్వాహణాధికారి వి. కె.శీనానాయక్‌ వీరిని అభినందించి, అమ్మవారి ప్రసాదములను అందించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....