అచ్చంపేట నియోజకవర్గం BRS ప్రజా ఆశీర్వాద సభలో KCR

 కొడంగల్‌కు రా.. కొడవలితో రా.. గాంధీ బొమ్మకు వద్దకు రా.. ఇవా  సవాళ్లు!

      కేసీఆర్‌ దమ్ము ఏంటో ఇండియా అంతా చూసింది

అచ్చంపేట అక్టోబర్‌ 26 (ఇయ్యాల తెలంగాణ ): కొడంగల్‌కు రా.. కొడవలితో రా.. గాంధీ బొమ్మకు వద్దకు రా.. అని సవాళ్లు విసురుతున్నారు. ఇది రాజకీయం అవుతుందా..? దీన్ని రాజకీయం అనుకోవచ్చునా..? అంటూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిపై సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ దమ్ము ఏంటో ఇండియా అంతా చూసింది. విూరంతా కేసీఆర్‌ దమ్ము(ప్రజలను ఉద్దేశించి).. ఈ దమ్ము గట్టిగా బయలెల్లుతే దుమ్ము దుమ్ము లేస్తది. లెవ్వాలి. నవంబర్‌ 30న దుమ్ము రేగాలి. బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో బాలరాజు గెలిచి రావాలి అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. అచ్చంపేట నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.తెలంగాణ ప్రయాణం జరిగేటటువంటి ఈ పదో ఏడాదిలో మళ్లా ఒక్కసారి ఎన్నికలు వచ్చాయని కేసీఆర్‌ తెలిపారు. విషయం మొత్తం విూకు తెలుసు. ఎలక్షన్‌లో ఏం జరుగుతదో కూడా విూకు తెలుసు. 24 ఏండ్ల నాడు ఎవరు లేరు. ఇవాళ లేచినోడు లెవ్వనోడు లేచి కేసీఆర్‌ నీకు దమ్మున్నదా..? కేసీఆర్‌ డంగల్‌కు రా అని ఒకడు.. నువ్వు గాంధీ బొమ్మ కాడికి రా అని ఒకడు.. అసలు ఇవి సవాళ్లేనా..? ఇది రాజకీయం అవుతుందా..? రాజకీయం అనుకోవచ్చునా..? అని కేసీఆర్‌ ప్రశ్నించారు.ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి.. ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి.. అప్పుడే బతుకులు బాగుపడుతాయి అని కేసీఆర్‌ అన్నారు. ఉద్యమ సమయంలో ఇవాళ మాట్లాడే సిపాయిలు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఊరు, వాడ పక్షిలాగా తిరిగి యావత్‌ తెలంగాణను ఉద్యమ కెరటంగా తయారు చేస్తే తెలంగాణ వచ్చి బతికిపోయాం. గడ్డకు పడ్డాం. డిరడి విూద నుంచి వచ్చాను. చాలా దూరం దుందుభి నది కనబడుతుంది. చెక్‌ డ్యాంలు కనబడుతున్నాయి. దుమ్ము లేసిపోయిన దుందుభిలో నీళ్లు కనబడుతున్నాయి అని కేసీఆర్‌ తెలిపారు.పాలమూరులో గంజి కేంద్రాలు, అంబలి కేంద్రాలు వెలిసినప్పుడు ఈ నాయకులు ఎక్కడున్నారు అని కేసీఆర్‌ ప్రశ్నించారు. గొంతులు ఎండి నీళ్ల కోసం ఐదు కి.విూ. నడిచినప్పుడు, అర్ధరాత్రి కరెంట్‌ కోసం పోయి చచ్చిన నాడు, ముంబై వలస పోయినప్పుడు ఈ కొడుకులు ఒక్కడన్న ఉన్నాడా. ఎవడన్నా వచ్చిండ్రా.. రేపు వస్తారా. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు. వారి మాటలు వినొద్దు. నేను చెప్పే మాటలను వినండి.. ఆలోచించండి. ఒకప్పుడు నేను పోరాటం చేశాను. ఇప్పుడు విూరు పోరాటం చేయాలి. తెలంగాణ కోసం నేను బయల్దేరినప్పుడు ఎవరికీ నమ్మకం లేదు. పిడికెడు మందిని పెట్టుకుని, పోరాటం చేశాం. నిజాయితీగా, దమ్ము, ధైర్యంతో ముందుకెళ్తే.. విధిలేక తెలంగాణను ఇచ్చారని కేసీఆర్‌ గుర్తు చేశారు.పదేండ్ల కింద తెలంగాణ ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాలని ప్రజలకు కేసీఆర్‌ సూచించారు. కరెంట్‌, మంచినీళ్లు, సాగునీళ్లు లేవు. వలస బతుకులు, పటాకులు కాలినట్టు మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలుడు. ఆ గోస యాది చేసుకుంటే భయం అయితది. అంత గోస అనుభవించింది తెలంగాణ. 24 గంటల కరెంట్‌ ఇస్తున్న రాష్ట్రం మనదే. కాంగ్రెసోళ్లు పోయి కర్ణాటకలో నరికారు.. కానీ కరెంట్‌ ఇవ్వలేదు. కర్ణాటక రైతులు కరెంట్‌ కోసం ధర్నాలు చేస్తున్నారు. ఇండియా మొత్తంలో ప్రధాని రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్‌ లేదు అని కేసీఆర్‌ తెలిపారు.ఇక రాష్ట్రంలో బీజేపీ ముఖ్యమంత్రులు దిగుతారని కేసీఆర్‌ అన్నారు. వారి రాష్ట్రాల్లో మంచినీళ్లు, కరెంట్‌ ఇవ్వలేనోళ్లు వచ్చి ఉపన్యాసాలు చెబుతారు. కానీ కేసీఆర్‌ దేశానికి ఒక మార్గదర్శనం చూపించారు. ఇండియాలో ఒక్కటే ఒక్క స్టేట్‌.. ఇంటింటికీ మంచినీళ్లు ఇచ్చేది మనమే. కేసీఆర్‌ దమ్ము సంగతి ఇండియా అంతా చూసింది. విూరంతా కేసీఆర్‌ దమ్ము.. ఈ దమ్ము గట్టిగా బయల్లెలుతే దుమ్ము దుమ్ము లేస్తది. లెవ్వాలి. నవంబర్‌ 30న దుమ్ము రేగాలి. బ్రహ్మాండమైన మెజార్టీతో బాలరాజు గెలిచి రావాలి అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....