అత్తగారింటికి RTC బస్సు వేసు కెళ్లిన అల్లుడు.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే !

నంద్యాల, జూలై 30 (ఇయ్యాల తెలంగాణ) : నంద్యాల జిల్లాలో ఓ వ్యక్తి చేసిన నిర్వాకం వైరల్‌ అయ్యింది. అత్తా రింటికి ఆర్టీసీ బస్సు వేసుకుని వెళ్లడంతో అందరూ అవాక్కయ్యా రు. వెంకటాపురానికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తి ఆత్మకూరు నుంచి తన అత్తగారి ఊరు ముచ్చు మర్రి వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉన్నాడు. ఎంతసేపటికి బస్సు రాక పోవడంతో దుర్గయ్యకు విసుగొచ్చిం ది. ఎంతసేపు ఎదురు చూసినా బస్సు రాకపోవడంతో.. వెంటనే పెట్రోల్‌ బంక్‌ దగ్గర ఉన్న ఆర్టీసీ ప్రైవే ట్‌ బస్సు ఎక్కాడు.. ఆ బస్సును నడుపుకుంటూ అత్తగారి ఊరికి వెళ్లాడు.అయితే అక్కడితో దుర్గ య్య ఊరుకోలేదు. ఆత్మకూరు నుంచి ముచ్చుమర్రి బస్సులో వెళ్లి.. మళ్లీ బస్సును తీసుకెళ్లి పోలీస్‌ స్టేషన్లో అప్పగించాడు. ఈ బస్సు ను ఎందుకు వేసుకుని వచ్చావని పోలీసులు అడిగితే.. ఊరికి వెళ్లడా నికి ఎంత సేపు బస్సు రాకపోవడం తో ఈ బస్సును వేసుకుని వచ్చా నని దుర్గయ్య సమాధానం చెప్పా రు. మనోడి సమాధానం విన్నపో లీసులు ఒకింత ఆశ్చర్యపోయారు. వెంటనే బస్సును ముచ్చుమర్రి పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఆత్మకూరుకు తరలించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....