అత్యధిక సంఖ్యలో ఇండియాలోనే క్షయ వ్యాధి కేసులు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి

న్యూఢల్లీ నవంబర్‌ 9 (ఇయ్యాల తెలంగాణ );అత్యధిక సంఖ్యలో క్షయ కేసులు ఇండియాలోనే నమోదు అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిరచింది. 2022లో భారత దేశంలోనే ఆ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ఓ రిపోర్టులో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసుల్లో ఇండియాలోనే 27 శాతం టీబీ కేసులు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 28.2 లక్షల కేసులు ఉన్నాయని, దాంట్లో 12 శాతం అంటే 3.42 లక్షల మంది ఆ వ్యాధికి బలైనట్లు రిపోర్టులో తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. 30 దేశాల్లో 87 శాతం టీబీ కేసులు ఉన్నట్లు తేలింది.భారత్‌ తర్వాత అత్యధిక టీబీ కేసులు ఉన్న దేశాల్లో ఇండోనేషియా(10 శాతం), చైనా(7.1 శాతం), పిలిప్పీన్స్‌(7 శాతం), పాకిస్థాన్‌(5.7 శాతం), నైజీరియా(4.5 శాతం), బంగ్లాదేశ్‌(3.6 శాతం), కాంగో(3 శాతం) ఉన్నాయి. అయితే భారత్‌లో క్షయవ్యాధి కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. 2015లో ప్రతి లక్ష మందిలో 258 మంది క్షయ వ్యాధిగ్రస్తులు ఉండేవారు, అయితే 2022 నాటి ఆ సంఖ్య 199కి పడిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన రిపోర్టులో తెలిపింది. కానీ ప్రపంచ సగటుతో పోలిస్తే చాలా ఎక్కువే ఉన్నట్లు తెలిసింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....