అత్యవసర సేవలకు కంట్రోల్‌ రూమ్‌

నిరంతర సేవలు అందిస్తున్న జీహెచ్‌ఎంసి

హైదరాబాద్‌,జూలై 27 (ఇయ్యాల తెలంగాణ) : భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ నగరంలో ప్రజలు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సేవలు అందిస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలత రెడ్డి లతో కలిసి జీహెచ్‌ఎంసి కార్యాలయంలోని కంట్రోల్‌ రూమ్‌ ను సందర్శించారు. కంట్రోల్‌ రూమ్‌ కు వస్తున్న పిర్యాదులు, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఆరా తీశారు. మూడు షిఫ్టులలో వివిధ శాఖల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు మంత్రికి వివరించారు. వాతావరణ శాఖ అందించే సమాచారం మేరకు జీహెచ్‌ఎంసి  పరిధిలోని అధికారులు, సిబ్బందిని  అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలత రెడ్డి,  కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, కలిసి విూడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు, మున్సిపల్‌ శాఖ మంత్రి  కల్వకుంట్ల తారక రామారావు ల దూరదృష్టి ఆలోచనలతోనే నగరంలోని అనేక ప్రాంతాలలో వరద ముంపు సమస్య తొలగిపోయిందని పేర్కొన్నారు. 

నగరంలోని నాలాల సమగ్ర అభివృద్ధి కోసం చేపట్టిన ఎస్‌ఎన్డీపీ  కార్యక్రమం క్రింద 36 నాలాల అభివృద్ధి పనులు చేపట్టగా, 30 పనులు పూర్తయ్యాయని, మిగిలిన 6 పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. గత సంవత్సరం వరకు బేగంపేట నాలాకు ఎగువ నుండి వచ్చే వరదనీటి వలన నాలా వెంట ఉన్న బ్రాహ్మణ వాడి, శ్యాం లాల్‌ బిల్డింగ్‌ తదితర కాలనీలు వరదనీటితో మునిగిపోయి ప్రజలు అనేక అవస్తలు పడేవారని పేర్కొన్నారు. ఎస్‌ఎన్డీపీ కార్యక్రమం క్రింద బేగంపేట నాలా అభివృద్ధి పనులు చేపట్టిన ఫలితంగా ఈ సంవత్సరం అలాంటి పరిస్థితులు ఏర్పడలేదని చెప్పారు. ప్రారంభంలో ఎస్‌ఎన్డీపీ కార్యక్రమంపై పలు విమర్శలు వచ్చాయని, కానీ వాటి ఫలితాలు నేడు కండ్ల ముందు కనిపిస్తున్నాయని అన్నారు. అదేవిధంగా విజిలెన్స్‌ ఎన్ఫోర్స్‌ మెంట్‌ విభాగం దేశంలో ఎక్కడా లేదని, ఆ శాఖ ద్వారా కూడా ప్రజలకు వివిధ అత్యవసర సేవలు అందించాబడుతున్నాయని అన్నారు.  కంట్రోల్‌ రూమ్‌ కు వచ్చే పిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ క్షేత్రస్థాయి లోని సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్న అధికారులు, సిబ్బందిని మంత్రి ఈ సందర్బంగా అభినందించారు. 

అదేవిధంగా ప్రింట్‌ మరియు ఎలక్ట్రానిక్‌ విూడియా ద్వారా కూడా ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు రావడం పట్ల కూడా మంత్రి వారిని అభినందించారు. 

ప్రజలు అత్యవసర సేవలకు  కంట్రోల్‌ రూమ్‌ (040`21111111, 9000113667)  కు కాల్‌ చేయాలని కోరారు. హుస్సేన్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ లలో ఇన్‌ ఫ్లో, ఔట్‌ ఫ్లో పై ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నట్లు వివరించారు. ఎమర్జెన్సీ టీం లు కంట్రోల్‌ రూమ్‌ నుండి వచ్చే ఆదేశాలతో ఎప్పటికప్పుడు స్పందిస్తున్నాయని అన్నారు. నీరు నిలిచిపోవడం, చెట్లు కూలిపోవడం, సీవరేజ్‌ పొంగిపోవడం వంటి పిర్యాదులు అధికంగా వస్తున్నాయని, వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. చెత్త తొలగింపు, పారిశుధ్య నిర్వహణ వంటి కార్యక్రమాలు కూడా ఎక్కడ ఆగకుండా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 

రోడ్లు కూడా దెబ్బతిన్న ప్రాంతాలలో ఎప్పటికప్పుడు అవసరమైన మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా సర్కిల్‌ కు ఒకటి చొప్పున 30 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరో 2, 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ ప్రకటించిందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని మంత్రి కోరారు. ముసరం బాగ్‌ వంతెన నిర్మాణ పనులను కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....