అదుపుతప్పిన వేగంతో దూసుకొచ్చిన కారు మార్నింగ్ వాకర్స్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తల్లీ కూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందగా… మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు మార్నింగ్ వాకింగ్ కు వచ్చిన అనురాధ (38), మమత (24) పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను హుటా హుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం నార్సింగి పరిధిలోని సన్ సిటీ వద్ద జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అదుపుతప్పిన వేగంతో మృత్యువు రూపంలో దూసుకొచ్చిన కారు మార్నింగ్ వాకర్స్ ను ఢీకొట్టి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదం నేపథ్యంలో ఘటన స్థలం రక్త మోడిరది.