అధికారులతో చెప్పనీయకుండా అడ్డుకున్న నీచ చరిత్ర BRS ది MP బండి సంజమ్‌


కరీంనగర్‌  జనవరి 25 (ఇయ్యాల తెలంగాణ );కరీంనగర్‌ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ విూడియాతో మాట్లాడారు. కేటీఆర్‌ ఇంకా అధికారంలో ఉన్నానని భావిస్తున్నడు. ఆదే అహంకారం కన్పిస్తోంది. కేసీఆర్‌ పాలనలోని అరాచకాలను, అవినీతిని బయటపెట్టిందే బీజేపీ? అందుకే జనం ఆ పార్టీని బొందపెట్టారు. అయినా సిగ్గు లేకుండా అరువు జిల్లా నేతను తీసుకొచ్చి మొరుగుతున్నడని మండిపడ్డారుబండి సంజయ్‌ ఏం చేసిండో విూ అయ్య(కేసీఆర్‌ ను) రమ్మను. చర్చించేందుకు సిద్ధం. నువ్వెన్ని మొరిగినా నీ కుటుంబ గుత్తాధిపత్యాన్ని నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. కరీంనగర్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ది మూడో స్థానమే? బీఆర్‌ఎస్‌ కు డిపాజిట్‌ రాదు. ఇక్కడున్న సోకాల్డ్‌ మేధావి(వినోద్‌ కుమార్‌) టిప్పర్‌ దరఖాస్తులు పంపిండు తప్ప? ఒక్క పని చేయలే దని అన్నారు.కేసీఆర్‌ కుటుంబానికి ఆయన ఉపయోగపడ్డారే తప్ప కరీంనగర్‌ కు చేసిందేవిూ లేదు. కరీంనగర్‌.. జగిత్యాల, కరీంనగర్‌?వరంగల్‌ జాతీయ రహదారి పనులకు నిధులు తెచ్చిందెవరు ? ఆయన ఎంపీగా ఉన్నన్నాళ్లు కరీంనగర్‌` వరంగల్‌ రోడ్డు అధ్వాన్నంగా ఉండి యాక్సిడెంట్స్‌ అవుతుంటే ఎన్నడైనా నిధులు తెచ్చినవా ? నేను ఎంపీగా ఉంటూ కేంద్రంతో మాట్లాడి రిపేర్లకు రూ.41 కోట్లు తెచ్చినానని అన్నారు.ఆ తరువాత కేంద్ర మంత్రితో మాట్లాడి కరీంనగర్‌..వరంగల్‌,  కరీంనగర్‌..జగిత్యాల, ఎల్కతుర్తి, ద్దిపేట జాతీయ రహదారి విస్తరణ పనులసహా రోడ్ల నిర్మాణం కోసం దాదాపు రూ.8వేల కోట్లకు పైగా నిధులు తెచ్చిందెవరు ?  విూ అయ్య తెచ్చిండా?….తెచ్చింది నేనే కదా అని అన్నారు.కరీంనగర్‌ రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ నిధులు తెచ్చింది నేనే కదా.  తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణానికి నిధులు తెచ్చింది నేనే కదా ? శాతవాహన యునివర్శిటీకి అటానమస్‌ హోదా, ఎస్సారార్‌ కాలేజీకి 12బీ హోదా తెచ్చిందెవరు ? నేనే కదా. విూ అయ్య తెచ్చిండు అనుకున్నవా ? కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో 3 వేల ఇండ్లు మంజూరు చేయించిన. విూరు కడతానంటే కేంద్రంతో మాట్లాడి ఇంకా 10 వేల ఇండ్లయినా తీసుకొస్తానని చెబితే, నువ్వు చేసిందేమిటి? ఆ నిధులను దారి మళ్లించింది విూరు కాదా ? నేను నిధులు తీసుకొస్తే, వాటికి కొబ్బరికాయలు కొట్టి మేమే తెచ్చినట్లుగా ఫోజు కొట్టింది విూరు కాదా ? 2015లో కరీంనగర్‌ ను స్మార్ట్‌ సిటీ కింద గుర్తించి రూ.196 కోట్లు మంజూరు చేస్తే.. ఆ నిధులను 4 ఏళ్లపాటు మళ్లించిన మూర్ఖులు బీఆర్‌ఎస్‌ నేతఅని అన్నారు.కేంద్రం విసిగిపోయి 2019 ఆగస్టులో ఒకసారి, నవంబర్‌ లో మరోసారి లేఖ రాసింది నిజం కాదా? విూరు నిధులు ఎందుకు దారి మళ్లిస్తున్నరు? విూరు వాటిని ఖర్చు చేయడంతోపాటు మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇస్తరా? లేదా? అని నిలదీసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

2020లో మళ్లీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి నిలదీసినా ఎందుకు పట్టించుకోలేదు? అప్పుడు ఈ మేధావి ఏం చేసిండు? సీఎంను గల్లా పట్టుకుని ఎందుకు నిలదీయలేదు? నేను పార్లమెంట్‌ స్టాండిరగ్‌ కమిటీ సభ్యుడిగా ఉంటూ విూటింగ్‌ పెడితే..ఈ లేఖలను బయపెడితే.. అప్పటి సంబంధిత అధికారి అరవింద్‌ కుమార్‌ నీళ్లు నమిలిన మాట వాస్తవం కాదా? 15 రోజుల్లోగా కేంద్రం ఇచ్చిన నిధులతోసహా రాష్ట్రం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వకపోతే వడ్డీతోసహా ముక్కుపిండి వసూలు చేస్తానని వార్నింగ్‌ ఇస్తే దిగొచ్చిన మాట వాస్తవం కాదా అని అన్నారు.నేను ఎంపీగా ఏం చేశానో, ఎన్ని నిధులు తీసుకొచ్చానో.. ఇదిగో పుస్తకమే ఉంది. చదువుకోండి. మరి విూరు చేసిన అభివ్రుద్ధి ఏందో దమ్ముంటే చెప్పండి. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా అధికారులతో చెప్పనీయకుండా అడ్డుకున్న నీచ చరిత్ర బీఆర్‌ఎస్‌ ది. గుడికి, బడికి బండి సంజయ్‌ పైసలిచ్చిండా? అని కేటీఆర్‌ వాగుతున్నడు? సిగ్గుండాలే.. విద్య, దేవాలయాలు రాష్ట్రం పరిధిలో ఉన్నాయా? కేంద్రం పరిధిలో ఉన్నాయా? అయినా నేను ఏం చేశానో ప్రజలకు తెలుసు.వేములవాడలోనే విూ అయ్య పెళ్లి చేసుకున్నడు కదా. ఏటా రూ.వంద కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఇస్తానన్నడు. కొండగట్టు,  ధర్మపురి, కాళేశ్వరం ఆలయాలకు రూ.100 కోట్ల చొప్పున ఇస్తానని హావిూ ఇచ్చిండు.. ఎందుకు ఇయ్యలేదు? మసీదుల అభివ్రుద్ధికి వందల కోట్లు ఇస్తున్న విూరు, డబ్బుల్లేక శిథిలావస్థలో ఉంటూ దూపదీప నైవైద్యాలకు కూడా నోచుకోని ఆలయాలకు ఎన్నడైనా పైసా ఇచ్చారా అని నిలదీసారుక్రికెట్‌ లో ఇండియా ఓడిపోతే పాకిస్తాన్‌ జెండాలు పట్టుకుని తిరిగిన వాళ్ల సంగతి చూసినా. లవ్‌ జిహాదికి వ్యతిరేకంగా, ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడిరది నేను. బైంసాలో హిందువుల ఇండ్లపై దాడులు చేసి దారుణంగా హింసిస్తే వాళ్లకు అండగా ఉన్నది నేను. 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతానన్న అక్బరుద్దీన్‌ ఒవైసీని వెనుకేసుకొచ్చి కేసు కొట్టివేయించేలా చేసిన నీచులు విూరు. పాతబస్తీకి రావాలంటే నా పర్మిషన్‌ కావాలని ఒవైసీ అంటే పారిపోయిన పిరికిపందలు విూరు. సవాల్‌ చేసి పాతబస్తీకి వెళ్లి సత్తా చాటిన చరిత్ర మాది. కేటీఆర్‌ తోనే బీఆర్‌ఎస్‌ సర్వనాశనమైందని అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....