అనాథ పిల్లలకు RESIDENTIAL స్కూల్స్ : CM యోగి

లక్నో, ఆగస్టు 3, (ఇయ్యాల తెలంగాణ);ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా నిరుపేద కుటుంబాలు, అనాథ పిల్లల ఉన్నత విద్య కోసం సీఎం యోగి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నిరుపేదలు, అనాథలు, కూలీలకు చెందిన వారి పిల్లలకు అత్యుత్తమ సౌకర్యాలతో కూడిన రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో బోధించే విధంగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది.

 రాష్ట్రంలోని 18 జిల్లాల్లో అటల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు నడిపేందుకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌. అయితే.. 18 అటల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 16 పాఠశాలల్లో విద్యాబోధన ప్రారంభించేందుకు యోగి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.16 జిల్లాల్లో నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. అఃూఇ బోర్డు ఆధ్వర్యంలోని ఈ పాఠశాలల్లో, ఉచిత హాస్టల్‌తో సహా అన్ని అత్యాధునిక సౌకర్యాలు పిల్లలకు అందుబాటులో ఉంటాయి.పూర్తయిన 16 పాఠశాలల్లో ఆగస్టు నెలాఖరులోగా 6వ తరగతి నుంచి తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మిగిలిన 2 పాఠశాలలు కూడా ఈ ఏడాది చివరి నాటికి సిద్ధం కానున్నాయి. 1189.88 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ 18 రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో అన్ని అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు బోధించనున్నారు.అజంగఢ్‌, బస్తీ, లక్నో, అయోధ్య, బులంద్‌షహర్‌ (విూరట్‌), గోండా, గోరఖ్‌పూర్‌, లలిత్‌పూర్‌ (రaాన్సీ), ప్రయాగ్‌రాజ్‌, సోన్‌భద్ర (విూర్జాపూర్‌), ముజఫర్‌నగర్‌ (సహారన్‌పూర్‌), బందా, అలీగఢ్‌, ఆగ్రా, వారణాసి, కాన్పూర్‌, బరేలీలో అటల్‌ హౌసింగ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలను నిర్మిస్తున్నారు.

అటల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలకు బోధన, బోధనేతర సిబ్బంది నియామక ప్రక్రియ కూడా దాదాపు పూర్తయింది. వీటిలో ప్రధానోపాధ్యాయుల నియామకం ఏప్రిల్‌ 5 నాటికి పూర్తికాగా, జూన్‌ 22న అడ్మినిస్ట్రేటివ్‌ అధికారుల నియామక ప్రక్రియ పూర్తయింది. అదేవిధంగా జూన్‌ 26న ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తయింది. మరోవైపు చివరి దశలో ఉన్న బోధనేతర సిబ్బందికి ఇంటర్వ్యూ ప్రక్రియ కొనసాగుతోంది. దీనితో పాటు, అన్ని పాఠశాలలకు ఫర్నిచర్‌, మెస్‌ సర్వీస్‌, ఫ్యాకల్టీ మేనేజ్‌మెంట్‌, యూనిఫాంలు,

 ఇతర ఉపకరణాల లభ్యత కూడా త్వరగా పూర్తవుతుంది. ఈ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి.ఈ పాఠశాలల్లో ఉచిత హాస్టల్‌ సౌకర్యం ఉంటుంది. పిల్లల కోసం ప్రత్యేకమైన విద్యా పాఠ్యాంశాలు కూడా రూపొందించబడ్డాయి. దీనితో పాటు కంప్యూటర్‌ ల్యాబ్‌, సైన్స్‌ ల్యాబ్‌, మ్యాథమెటిక్స్‌ ల్యాబ్‌, సోషల్‌ సైన్స్‌ ల్యాబ్‌, అటల్‌ థింకింగ్‌ ల్యాబ్‌, ఎక్స్‌పెరిమెంటల్‌ ల్యాబ్‌ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. పిల్లల అడ్మిషన్ల ప్రక్రియ సైతం పూర్తయింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....