అమరావతి రాజధాని, విభజన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ 28కి వాయిదా

న్యూఢిల్లీ, నవంబర్ 14 (ఇయ్యాల తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అమరావతి రాజధాని, విభజన పిటిషన్లపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న ఏపీ హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో సవాల్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని ప్రభుత్వం పిటిషన్‌ లో కోరింది. అయితే అమరావతి, విభజన పిటిషన్లను విడిగా విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. అనంతరం తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....