అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. మాస్‌ షూటింగ్‌లో 22 మంది మృతి

వాషింగ్టన్‌ అక్టోబర్‌ 26 (ఇయ్యాల తెలంగాణ ): అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. మైనే రాష్ట్రంలోని లెవిస్టన్‌లో దుండగులు జరిపిన మాస్‌ షూటింగ్‌లో 22 మంది మరణించారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన వారికోసం గాలిస్తున్నామని చెప్పారు.ఆండ్రోస్కోగ్గిన్‌ కౌంటీ షెరీఫ్‌ పోలీస్‌ కార్యాలయం వారి ఫేస్‌ బుక్‌ పేజీలో అనుమానితుడి ఫొటోలను విడుదల చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, అన్ని వ్యాపార సంస్థలను మూసివేయాలని సూచించారు. ప్రజలు ఇండ్లలోనే ఉండాలని కోరారు.

 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....