’ అల్యూమినియం ఫ్యాక్టరీలో హ్యుజ్‌ Climax షూటింగ్‌

  నేచురల్‌ స్టార్‌ నాని, వివేక్‌ ఆత్రేయ, డివివి ఎంటర్‌టైన్‌మెంట్‌ పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ‘సరిపోదా శనివారం’ అల్యూమినియం ఫ్యాక్టరీలో హ్యుజ్‌ క్లైమాక్స్‌ షూటింగ్‌

నేచురల్‌ స్టార్‌ నాని తన అప్‌ కమింగ్‌ పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ‘సరిపోద శనివారం’లో సూర్య పాత్రలో మునుపెన్నడూ చూడని ఇంటెన్స్‌ పవర్‌`ప్యాక్డ్‌ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ అడ్రినలిన్‌తో కూడిన యూనిక్‌ అడ్వంచర్‌ ని భారీ కాన్వాస్‌పై హై బడ్జెట్‌తో డివివి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్‌ దాసరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

తాజాగా చిత్ర బృందం క్లైమాక్స్‌ షూటింగ్‌ను ప్రారంభించింది. ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ కోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో హ్యుజ్‌ సెట్‌ను నిర్మించారు.ప్రియాంక మోహన్‌ కథానాయికగా నటిస్తుండగా, ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. మురళి జి డివోపీగా పని చేస్తున్నారు. జేక్స్‌ బిజోయ్‌ సంగీతం అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్‌ ఎడిటర్‌.ఈ పాన్‌ ఇండియా చిత్రం ఆగస్టు 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

నటీనటులు: నాని, ప్రియాంక అరుల్‌ మోహన్‌, ూఏ సూర్య, సాయి కుమార్‌

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....