అల్లం “టీ” నిజమైన Tips – కొలతలు

అసలైన అల్లం “టీ” రుచిని మీరు పొందాలన్నా ! ఆ “టీ” యొక్క ప్రయోజనాలు పొందాలన్నా!

కొన్ని రకాల చిన్న చిన్న చిట్కాలతో మరింత రుచిగా ఉండే “టీ “ని మీరు తయారు చేసుకోగలరు. 

నిజమైన టిప్స్ కొలతలు : 

👉 ముందుగా రెండు యాలకులను దంచుకోండి. 

👉 ఆ తరువాత ఒకటిన్నర ఇంచ్ ల ముదిరిన అల్లం వేసి దంచుకోండి. 

👉 ముదిరిన అల్లం అంటే ఎక్కువగా పీచు ఉన్న అల్లం. 

👉 దీనినే మనం పాత అల్లం అని కూడా అంటూ ఉంటాం. 

👉 ఇందులోనే అల్లం ఘాటు సరిగ్గా ఉంటుంది. 

 ఇప్పుడు టీ ప్యాన్ (గిన్నె) లో 250 ml నీళ్లను పోసి బాగా మరిగించుకోండి. 

ఇందులో దంచి ఉంచిన అల్లం, యాలకులు వేసి రెండు నిముషాలు మరిగించుకోండి. 

ఇలా చేయడం వల్ల అల్లం సారవంతమైన మరిగే నీళ్ళలోకి దిగుతుంది. 

మరుగుతున్న అల్లం లో 2 టేబుల్ స్పూన్ ల పంచదార వేసి నిముషం పాటు మరిగించండి. 

పంచదార కాస్త మరిగింతరువాత అల్లం తో మిళితమై అల్లం ఘాటును బ్యాలెన్స్ చేస్తుంది. 

ఖచ్చితంగా పంచదారను అల్లం తో పాటు వేసి మరిగించాలి. 

అల్లం పూర్తిగా మరిగాక ఒకటిన్నర టేబుల్ స్పూన్ ల టీ పొడి వేసి నిముషం పాటు మరిగించాలి. 

ఇందులో 250 ML పాలు పోసి మరో మూడు నిముషాల పాటు మరిగించండి. 

మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం – రుచికి రుచి ఈ అల్లం తేనీటి (టీ) తో  అందుతోంది. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....