అల్లు శిరీష్‌ ‘‘బడ్డీ’’ సినిమా నుంచి First Lyrical Song

 

 అల్లు శిరీష్‌ ‘‘బడ్డీ’’ సినిమా నుంచి ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ ‘ఆ పిల్ల కనులే..’ రేపు రిలీజ్‌

అల్లు శిరీష్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘‘బడ్డీ’’. గాయత్రి భరద్వాజ్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ ఫిలింస్‌ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా, అధన జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. శామ్‌ ఆంటోన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్‌ రాజా కో ప్రొడ్యూసర్‌ గా వ్యవహరిస్తున్నారు. యూత్‌ ఫుల్‌ లవ్‌ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కుతున్న బడ్డీ సినిమా నుంచి ఈ రోజు ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌ అనౌన్స్‌ మెంట్‌ చేశారు.రేపు ఉదయం 10 గంటలకు ఈ మూవీ ఫస్ట్‌ సింగిల్‌ ‘ఆ పిల్ల కనులే..’ను రిలీజ్‌ చేయబోతున్నట్లు తెలిపారు. హిప్‌ హాప్‌ తవిూజా ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న బడ్డీ సినిమా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ కు రాబోతోంది. రిలీజ్‌ డేట్‌ ను త్వరలో అనౌన్స్‌ చేయబోతున్నారు.నటీనటులు ` అల్లు శిరీష్‌, గాయత్రి భరద్వాజ్‌, తదితరులు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....