జగిత్యాల, జనవరి 24 (ఇయ్యాల తెలంగాణ) : ఆడపిల్లలను రక్షిద్దాం.. ఆడపిల్లలను చదివిద్దాం అంటూ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బుధవారం బాలికలతో ప్రతిజ్ఞ నిర్వహించారు. భేటీ బచావో… బేటి పడావో కార్యక్రమంలో భాగంగా జగిత్యాల అర్బన్ అంగన్వాడి టీచర్లు బాలికలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడపిల్లలకు సంపూర్ణ సాధికారతను ఇవ్వాలని,వారికి సమాన అధికారాలు, సమాన అవకాశాలు ఇచ్చినప్పుడే సమాజంలో సగమైన మహిళలు అన్ని రంగాలలో ముందుంటారని తెలిపారు. ఆడపిల్లల పట్ల ఎలాంటి విచక్షణ చూపించకుండా వారిని చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు దయావతి, యతీశ్వరి, నీలవేణి, రజని, అంజమ్మ, కళావతి, మమత తదితరులు పాల్గొన్నారు.
- Homepage
- Telangana News
- ఆడపిల్లలను రక్షిద్దాం.. ఆడపిల్లలను చదివిద్దాం.. : ICDS
ఆడపిల్లలను రక్షిద్దాం.. ఆడపిల్లలను చదివిద్దాం.. : ICDS
Leave a Comment