‘ఆదికేశవ’ ఆగస్ట్‌ 18న విడుదల

 పంజా వైష్ణవ్‌ తేజ్‌, సితార ఎంటర్టైన్మెంట్స్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ జులై 7,  (ఇయ్యాల తెలంగాణ ):

 ముఖ చిత్ర నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ విభిన్నమైన, ఆసక్తికరమైన చిత్రాలను అందిస్తున్నాయి. ఈ రెండు నిర్మాణ సంస్థలు వరుస ఘన విజయాలను అందించడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇప్పుడు వారు ‘ఆదికేశవ’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ కోసం మెగా హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌, రీసెంట్‌ సెన్సేషన్‌ శ్రీలీల తొలిసారి జతకట్టారు.ఈ చిత్రానికి శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు యాక్షన్‌ సినిమా ప్రేమికులను అలరించేలా ఆయన చిత్రాన్ని రూపొందిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఆదికేశవ యాక్షన్‌ టీజర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదలైన కూల్‌ టీజర్‌ కూడా యువతను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమా కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల నిరీక్షణకు ముగింపు పలుకుతూ, ఆదికేశవ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 18న విడుదల చేస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.శ్రీకరా స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.జాతీయ అవార్డు గ్రహీత మలయాళ స్టార్‌ యాక్టర్‌ జోజు జార్జ్‌ ఈ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. అలనాటి తార రాధిక, అపర్ణా దాస్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.అత్యంత ప్రతిభావంతుడు, జాతీయ అవార్డు గ్రహీత జివి ప్రకాష్‌ కుమార్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్‌ నూలి ఈ చిత్రానికి ఎడిటర్‌ గా వ్యవహరిస్తున్నారు.త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను వెల్లడిరచనున్నారు.తారాగణం: పంజా వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల, అపర్ణా దాస్‌, జోజు జార్జ్‌, రాధిక

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....