ఆధునాతనంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ – కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

సికింద్రాబాద్‌, నవంబర్ 15 ( ఇయ్యాల తెలంగాణ) :1874లో  సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నిర్మాణం జరిగింది. తెలంగాణలోనే ఇది అతి పెద్ద రైల్వేస్టేషన్‌. హైద్రాబాద్‌ లో 3రైల్వేస్టేషన్‌ లు ఉన్నాయి.  రద్దీని తగ్గించడం కోసం చెర్లపల్లిలో మరొక్క టెర్మినల్‌ ను ప్రారంభించాం. సికింద్రాబాద్‌ స్టేషన్‌ ను అభివృద్ధి పరచడం కోసం 719 కోట్ల నిధులను కేటాయించడం జరిగింది. రైల్వేస్టేషన్‌ పూర్తిగా ఆదునికరించనున్నామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. . రాబోయే 40ఏళ్ల తరువాత వచ్చే ప్రయాణికుల తాకిడిని కూడా తట్టుకునే విదంగా ఉంటుందని అన్నారు. జీ G 4 కారు పార్కింగ్‌ తో పాటు 24 లిఫ్టులు, ఎక్స లేటర్లు సీసీ కెమెరాల, వైఫై, అధునాతన రైల్వేస్టేషన్‌ గా ఇది మారనుంది. 

దక్షిణ భారతదేశంలోనే బెస్ట్‌  రైల్వేస్టేషన్‌ గా దీనిని రూపొందిస్తున్నాము. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు మూడు దశలలో పనులను పూర్తి చేయాలని అదేశాలివ్వడం జరిగింది. 36నెలలలో పనులను పుర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధమయ్యింది. 384 కోట్లతో వరంగల్‌ లో 150 ఎకరాలలో వర్క్‌ షాప్‌ నిర్మాణము చేపడుతున్నామని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తే MMTS 2వ ఫేస్‌

రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటే ఎంఎంటిఎస్‌ 2వ ఫేస్‌ పూర్తి చేసి హైద్రాబాద్‌ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలమని   కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఎంఎంటిఎస్‌ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాడానికి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.
iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....