హైదరాబాద్, ఏప్రిల్ 24 (ఇయ్యాల తెలంగాణ) ఆన్ లైన్ స్పాట్ న్యూస్ : నవీన యుగంలో కూడా ఆధ్యాత్మిక రచనల ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని, తద్వారా సున్నిత మనస్తత్వం,సంస్కార లక్షణం అలవడుతుందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణా చారి అన్నారు. శ్రీ మానస ఆర్ట్ థియేటర్స్, చిరునవ్వు సంస్థల ఆధ్వర్యంలో ప్రముఖ కవి బండారు పల్లి రామ చంద్ర రావు రచించిన “శ్రీ కళ్యాణ వెంకటేశ్వర శరణు మంజరి” శ్రీ ఆనంద నిలయ దేవ శరణు మంజరి గ్రంథాల ఆవిష్కరణ సభ మాసాబ్ టాంక్ కె.వి.ఆర్ సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. కె.వి. రమణా చారి రెండు గ్రంథాలను ఘనంగా ఆవిష్కరించి ప్రసంగించారు. ఆధ్యాత్మిక రచయితలు సమాజ సంస్కారులని అభివర్ణించారు. ప్రముఖ దర్శక నిర్మాత “లక్ష్మణరేఖ” గోపాల కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గుదిబండ వెంకట్ రెడ్డి, రఘు శ్రీ, గ్రంథకర్త బండారు పల్లి రామచంద్ర రావు తదితరులు ప్రసంగించారు. బి. రామ కృష్ణ సభా సమన్వయం గావించారు.
- Homepage
- Telangana News
- ఆధ్యాత్మిక సాహిత్యంతో మనసులు పునీతం : డా. కె.వి. రమణా చారి
ఆధ్యాత్మిక సాహిత్యంతో మనసులు పునీతం : డా. కె.వి. రమణా చారి
Leave a Comment