హైదరాబాద్, జులై 8 (ఇయ్యాల తెలంగాణ) :
ఆషాడ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం నాడు మాసాబ్ ట్యాన్క్ లోని తన కార్యాలయంలో ఓల్డ్ సిటీ బోనాల ఉత్సవాల నిర్వహణపై మంత్రి సవిూక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ కరోనా కారణంగా రెండు సంవత్సరాల పాటు బోనాలు నిర్వహించుకోలేక పోయాం. ఈ నెల 17 న సికింద్రాబాద్ మహంకాళి, 24 న ఓల్డ్ సిటీ బోనాలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 18 న మహంకాళి అమ్మవారి అంబారీ ఊరేగింపు, 25 న ఉమ్మడి దేవాలయాల అంబారీ ఊరేగింపు వుంటుంది. ప్రధాన దేవాలయాల వద్ద సాంస్కృతిక శాఖ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు, చార్మినార్ వద్ద 500 మంది కళాకారులతో కళాప్రదర్శనలు వుంటాయని అన్నారు. గతంలో కంటే అధికంగా భక్తులు వస్తున్న నేపధ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు పోలీసు సిబ్బంది ఏర్పాటు చేసినట్లు అన్నారు. .