ఆ పోతురాజులు వచ్చి రంటే ధూం ధామే

కాకా …  ఆ పోతురాజులు వచ్చి రంటే ధూం ధామే

అమ్మ బైలెల్లినాదో  ! నాయనో తల్లీ బయలెల్లినాదో ! అనే మాట ఎంత నిజమో పోతురాజు బయలు దేరితే గానీ ఆ బోనాల జాతరకు ఒక వేడుక కనిపించదనేది అంతే నిజం. అలాంటి పోతురాజుల వేడుకల్లో కొందరు పోతురాజులు బయటకు వచ్చారంటే గల్లి గల్లీ పెద్ద లొల్లే మరి ! నిజమే అసలు పోతురాజులు లేకుంటే పిల్లల ఆనందాలు, అమ్మవారి ఊరేగింపుకు ఉత్సాహం ఎక్కడ వస్తుంది. పోతురాజుల వేషధారణ వారి విన్యాసాలు అంత ఇంత కాదు. ఇక పోతురాజులను ఆపడం ఎవ్వరి తరం కాదు. బోనాల జాతర వేడుకలకు ప్రధాన అలంకరణ పోతురాజులే …  అలాంటి పోతురాజుల విన్యాసాల్లో కొందరు పోతురాజులు వచ్చారంటే అమ్మో ఆ పోతురాజులా ! అని గుండె మీద ఒక్కసారి చేయి వేసుకునే పరిస్థితి రాక పోలేదు. నిజమే మరి అలాంటి పోతురాజుల బయటకు వచ్చారంటే ఇక ఉరుకులు పరుగులే లొల్లి లొల్లి తీన్మార్ మోతలే… 

మరి అలాంటి పోతురాజుల్లో పురానాపూల్ ప్రాంతానికి చెందిన పోతురాజులు బయటకు వచ్చారంటే ఒక్కొకనికీ ధే తడే ! అబ్బబ్బో ఎం మోత! ఎం కేక ! ఎం కాక అనే ధోరణిలో ఉంటుంది పురానాపూల్ పోతురాజుల వీరంగం. మరి ఇక పురానాపూల్ బ్యాండ్ బాజా ! ధే తడి తీన్మార్ లొల్లి లే అక్కడ పోతురాజు బయటకు వచ్చారంటే అందరికీ ఆనందం పండుగ వేడుక కళ్ళకు కట్టొచినట్లు కనిపిస్తుంది. దీనికి తోడు బ్యాండ్ కు సరైన విధంగా పని చెప్పే బ్యాండ్ ల మోత ఒక్కక్కరికీ అబ్బా  అనిపించే కళను తెచ్చిపెడుతుంది. మరి ఈ ఏడూ పురానాపూల్ పోతురాజుల ఎంత వీరంగం చేస్తారో చూడాల్సిందే…  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....