దరఖాస్తులకు తుది గడువు ఆగష్టు 5 – 2022
వాల్ పోస్టర్ విడుదల చేసిన కలెక్టర్ అమోయ్ కుమార్
హైదరాబాద్,జులై 30 (ఇయ్యాల తెలంగాణ) : ఇంటింటా ఇన్నోవేటర్ వంటి కార్యక్రమాలు నూతన ఆవిష్కరణలకు దోహదపడుతాయని విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయవచ్చునని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటా వెయిటర్ కార్యక్రమం చక్కని వేదికగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వారు రూపొందించిన ఇంటింటా ఇన్నోవేటర్ గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లా విద్యాశాఖాధికారిణి ఆర్. రోహిణి గారు మరియు జిల్లా సమన్వయకర్త సీ .ధర్మేందర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇన్నోవేషన్ మరియు సృజనాత్మకతను ప్రోత్సహించడానికి తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలు ఒకేసారి ఆయా జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా ఆవిష్కరణల ప్రదర్శనను నిర్వహిస్తున్నాయి ,
ఈ ప్రదర్శనలో పాల్గొనడానికి అన్ని రంగాల వర్గాల ఆవిష్కరణలను ప్రోత్సహించడం జరుగుతోందని గ్రామీణ ఆవిష్కరణ , విద్యార్థుల ఆవిష్కరణ , సూక్ష్మ మరియు చిన్నతరహా పరిశ్రమలలో ఆవిష్కరణలు మొదలగు అంగీకరించబడతాయి ,
ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణలకు సంబంధించిన ఆరు వ్యాఖ్యలు , రెండు నిమిషాల వీడియోను , ఆవిష్కరణ యొక్క నాలుగు ఫొటోలు , ఆవిష్కర్త పేరు , ఫోన్ నంబర్ , వయస్సు , ప్రస్తుతం వృత్తి , గ్రామం పేరు , జిల్లా పేరు తదితర వివరాలు వెంటనే 9100678543 కి వాట్సాప్ చేయగలరు , ఇన్నోవేటర్స్ నుండి దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ 05 ఆగస్ట్ 2022 అందుకున్న దరఖాస్తుల నుండి మొదటి షార్ట్ లిస్టు తర్వాత ప్రతి జిల్లా నుంచి ఐదు ఆవిష్కరణలను ప్రదర్శనకు ఎంపిక చేయబడతాయి మరిన్ని వివరాలకు జిల్లా సమన్వయకర్త సీ . ధర్మేందర్ రావు ను 7799171277 చరవాణిలో సంప్రదించాలని జిల్లా పాలనాధికారి తెలిపారు .