ఇంటింటా జాతీయ జెండా కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌ ఆగష్టు 14, (ఇయ్యాల తెలంగాణ ): స్వాతంత్ర వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.  ఈ రెండు రోజులపాటు దేశంలో ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు.  దేశంలో ప్రతి ఒక్కరు 75వ స్వాతంత్ర వేడుకలలో భాగ్యసాములు కావాలి. ప్రతి గ్రామంలో యువకులు తిరంగ యాత్ర మోటార్‌ సైకిల్‌ లతో ర్యాలీ నిర్వహించాలి. వ్యాప్తంగా  ప్రతి మండల్‌, జిల్లా కేంద్రాలలో పాటు ఢల్లీిలో కూడా 75 మొక్కలు నాటాలని అన్నారు.. ఈ సందర్భంగా చెట్లను నాటే కార్యక్రమాన్ని  అమృత వనంగా పేరు పెట్టడం జరిగింది.  ప్రపంచంలో భారతదేశం విశ్వ గురువు స్థానంలో ఉండాలి. దేశంలో నిరుద్యోగ పేదరిక, సమస్యను  నిర్మూలన చేయాలి.  ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకే ఈ కార్యక్రమం చేపడుతున్నాం ప్రతి ఒక్కరు భాగ్యస్వాములు కావాలని అన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....