ఇకపై రాజకీయ నేతలకు చుక్కెదురు – ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

ఒకే చోటు నుంచి పోటీ ఇది సాధ్యమయ్యేనా ?

ఓటరు ఒకే దగ్గర ఓటు వేసినట్లే రాజకీయ నాయకులు ఒక్క ప్రాంతం నుంచే పోటీ చేయగలరా ?

2004 నుంచి ప్రభుత్వాలను అడుగుతున్న ఎన్నికల సంఘం  –  ఈ  సారైనా కేంద్ర ఆమోదం లభించేనా ? 

న్యూఢిల్లీ, జూన్‌ 20, (ఇయ్యాల తెలంగాణ)

ఒకే అభ్యర్ధి ఒకటి కంటే ఎక్కువ అసెంబ్లీ /లోక్‌ సభ స్థానాల్లో పోటీ చేయకుండా ఆంక్షలు విధించాలని, కేంద్ర ఎన్నికల సంఘం, 2004 నుంచే కేంద్ర  ప్రభుత్వాన్ని కోరుతోంది. అయితే, కారణాలు ఏవైనా,  ప్రభుత్వాలు మాత్రం ఆ ప్రతిపాదనను పక్కన పెట్టాయి. అయితే ఇప్పడు  కేంద్ర ఎన్నికల సంఘం మళ్ళీ, మరోసారి అదే ఒకే అభ్యర్ధి ఒకటి కంటే ఎక్కువ అసెంబ్లీ /లోక్‌ సభ స్థానాల్లో పోటీ చేయకుండా ఆంక్షలు విధించాలని, కేంద్ర ఎన్నికల సంఘం, 2004 నుంచే కేంద్ర  ప్రభుత్వాన్ని కోరుతోంది. అయితే, కారణాలు ఏవైనా,  ప్రభుత్వాలు మాత్రం ఆ ప్రతిపాదనను పక్కన పెట్టాయి. అయితే ఇప్పడు  కేంద్ర ఎన్నికల సంఘం మళ్ళీ, మరోసారి అదే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచింది. ఒక అభ్యర్ధి ఒకటి కంటే ఎక్కువ స్థానాల నుంచి పోటీ చేయడంపై నిషేధం  అయినా విధించండి లేదంటే, రెండు స్థానాల నుంచి పోటీ చేసిన అభ్యర్ధి రెండు స్థానాలలో గెలిచి, ఏదో ఒక స్థానానికి రాజీనామ చేయవలసి  వస్తే, సదరు అభ్యర్ధి నుంచి భారీ జరిమానా వసూలు చేయాలని ఎన్నికల సంఘం సూచించింది.  కేంద్ర న్యాయ శాఖ లెజిస్లేటివ్‌ సెక్రటరీతో ఎన్నికల సంస్కరణల పై జరిపిన చర్చల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌, ఈ ప్రతిపాదన చేశారు.. సుమారు ఇరవై ఏళ్ల క్రితమే వచ్చిన ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు మళ్లీ తీసుకొచ్చింది. 

ఒక అభ్యర్థి రెండు  స్థానాల్లో పోటీ చేసి గెలిచినా.. ఒక స్థానం నుంచి  రాజీనామా చేయక తప్పదు. అప్పుడు రెండవ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమవుతుంది. ఉప ఎన్నిక ఎన్నికల నిర్వహణకు అయ్యే ఆర్థిక భారం ప్రభుత్వ ఖజానాపై పడుతోందని ఎన్నికల సంఘం తెలిపింది. అంతేగాక ఎన్నికల సమయంలో సిబ్బంది చాలా మంది అవసరమవుతు న్నారని పేర్కొంది. రెండు స్థానాల్లో పోటీ చేసి గెలుపొందిన వారు ఒక స్థానానికి రాజీనామా చేస్తే జరిమానా విధించాలని సూచించింది ఈసీ. శాసనసభ, శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసి రాజీనామా చేసిన వారికి రూ.5 లక్షలు, లోక్‌సభకు పోటి చేసే అభ్యర్థులకు రూ.10 లక్షలు జరిమానాగా విధించాలని ప్రతిపాదించింది. 1996లో ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి ఒక వ్యక్తి రెండు కంటే ఎక్కువ స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేయకుండా నియంత్రించారు. అంతకుముందు వరకు ఒక అభ్యర్థి ఎన్ని స్థానాల్లోనైనా పోటీ చేసే వీలుండేది. 1996 సవరణ తర్వాత ఒక అభ్యర్ధి రెండు స్థానాలు మించి పోటీ చేయకుండా ఆంక్షలు విధించిన, పార్టీల ముఖ్య నేతలు  రెండు స్థానాల్లో పోటీ చేస్తూనే, ఉన్నారు. 2014 లోక్‌ సభ ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌’లోని వడోదరా, ఉత్తర ప్రదేశ్‌’లోని వారణాసి స్థానల నుంచి పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు. ఆ తర్వాత వడోదర స్థానానికి రాజీనామా చేసారు. అలాగే, 2019లో రాహుల్‌ గాంధీ యూపీలోని  అమేథి, కేరళలోని వయానార్‌ నియోజక వర్గాల్‌ నుంచి పోటీ చేసినా, అమేథిలో అయన ఓడి పోవడంతో రాజానామా చేయవలసిన అవసరం రాలేదు.ఇలా, కీలక నేతలు సైతం రెండేసి  స్థానాల నుంచి పోటీ చేయడంతో    ఉప ఎన్నికలు అనివార్యం అవుతూనే ఉన్నాయి. 

అసెంబ్లీ, లేదా లోక్‌ సభ ఎన్నికల్లో  రెండేసి స్థానాల్లో పోటీ చేయడమే కాకుండా,  పదవిలో ఉండగానే పార్లమెంట్‌  సభ్యులు అసెంబ్లీ ఎన్నికల్లో, అసెంబ్లీ సభ్యులు లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయడం వలన కూడా ఉప ఎన్నికలు, అనవసర వ్యయం అనివార్య మవుతున్నాయి. సో .. ఎన్నికల సంఘం ప్రతిపాదనను, సంక్లిష్ట న్యాయ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వానికి సలహా ఇచ్చే, లా కమిషన్‌ కూడా సమర్ధించింది.వన్‌ కాండిడేట్‌ వన్‌ వన్‌ కాన్స్టిట్యూయన్సీ ఒక అభ్యర్ధి ఒక నియోజక వర్గం ప్రతిపాదనకు పచ్చ జెండా ఊపింది. అయితే, రెండు నియోజక వరగాల్లో పోటీ చేసి గెలిచిన అభ్యర్ధుల నుంచి ఉప ఎన్నిక ఖర్చును వాసులు చేయాలన్న ప్రతిపాదనకు  మాత్రం లా కమిషన్‌ నో చెప్పింది. ఈ నేపధ్యంలో  బంతి ఇప్పుడు  మరోమారు  కేంద్ర ప్రభుత్వం కోర్టుకు చేరింది. వన్‌ నేషన్‌ వన్‌ టాక్స్‌, వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ అంటున్న కేంద్ర ప్రభుత్వం వన్‌ కాండిడేట్‌ వన్‌ వన్‌ కాన్స్టిట్యూయన్సీ కి అంగీకరిస్తుందా లేదా అనేది చూడవలసి వుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....