ఇక ఆర్టిఫిషియల్‌ యాంకర్‌…

హైదరాబాద్‌, జూలై 14, (ఇయ్యాల తెలంగాణ ): వార్తలు చదువుతున్నది’’ అని చెబుతుంటే మన ముందు తరం వాళ్లు చెవులు రిక్కించి మరీ రేడియో ఆన్‌ చేసుకుని న్యూస్‌ వినే వాళ్లు. టీవీ వచ్చాక అందరూ వార్తలు చూడడం మొదలు పెట్టారు. ఆ తరవాత టెక్నాలజీ మారుతూ వచ్చింది. న్యూస్‌ ఛానల్స్‌ పెరిగాయి. జర్నలిజం అప్‌డేట్‌ అయింది. న్యూస్‌ ప్రజంటేషన్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. వార్తలకు అదనపు హంగులు జోడిరచడం ట్రెండ్‌ అయింది. మరి ట్రెండ్‌ ఎప్పుడూ ఒక్కటే ఉండదుగా. అప్‌డేట్‌ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే అందరినీ ఆశ్చర్యపరిచే ట్రెండ్‌ ఇప్పుడు మొదలైంది. ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ టెక్నాలజీతో తయారు చేసిన యాంకర్‌లతో వార్తలు చదివిస్తున్నాయి న్యూస్‌ ఛానల్స్‌. ప్రపంచంలోనే తొలిసారి చైనాలో 2018 ఫిబ్రవరిలో జిన్హూ అనే న్యూస్‌ ఏజెన్సీ తొలి ంఎ యాంకర్‌ని ఇంట్రడ్యూస్‌ చేసింది. అందరూ ఇది చూసి నివ్వెరపోయారు. ఇప్పుడిదే టెక్నాలజీతో ఇండియాలోని న్యూస్‌ ఛానల్స్‌ కూడా ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ యాంకర్‌లను తెరపైకి తీసుకొస్తున్నాయి. వాటితో వార్తలు చదివిస్తున్నాయి. భారత్‌లో ఒడిశా టీవీ ఇటీవలే లిసా పేరిట ంఎ ంనిఞష్ట్రనీతీని ప్రవేశపెట్టింది. ఒరియాతో పాటు ఇంగ్లీష్‌లోనూ ఈ యాంకర్‌ వార్తల్ని గడగడా చదివేస్తోంది. ఆమె ంఎ తయారు చేసిన యాంకర్‌ అంటే ఎవరూ నమ్మలేరు. అంత మాయ చేసేసింది టెక్నాలజీ. చాలా సహజంగా వార్తల్ని చదివేసింది. చీరకట్టు, బొట్టుతో కట్టి పడేసింది. ఒరియా, ఇంగ్లీష్‌ మాత్రమే కాదు. అతి త్వరలోనే మరి కొన్ని భాషల్లోనూ ఈ ంఎ యాంకర్‌ వార్తలు చదివేస్తుందని ఒడిశా టీవీ వెల్లడిరచింది. అంతకు ముందు ఓ హిందీ న్యూస్‌ ఛానల్‌ కూడా ంఎ యాంకర్‌ని ఇంట్రడ్యూస్‌ చేసింది. కన్నడలోనూ ఓ న్యూస్‌ ఛానల్‌ సౌందర్య పేరిట ంఎ యాంకర్‌తో వార్తలు చదివిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కువైట్‌ న్యూస్‌  పేరుతో ఓ ంఎ యాంకర్‌ని పరిచయం చేసింది. అంతకు ముందు మార్చి నెలలో చైనాకు చెందిన  పీపుల్స్‌ డెయిలీ ఛానల్‌  రెన్‌ పేరుతో ఓ యాంకర్‌ని తెరపైకి తీసుకొచ్చింది. ఆడియెన్స్‌తో ఇంటరాక్ట్‌ అవడం ఈ యాంకర్‌ స్పెషాల్టీ. నిజానికి…డెవలపర్స్‌ కి ఇలా యాంకర్‌లని క్రియేట్‌ చేయడం చాలా సులువైన పనే అంటున్నారు ఎక్స్‌పర్ట్‌లు. వీటితో లాభమేంటంటే…24 గంటల పాటు రెస్ట్‌ లేకుండా వీటితో వార్తలు చదివించొచ్చు. పైగా మల్టిపుల్‌ లాంగ్వేజెస్‌లో. మరో హైలైట్‌ ఏంటంటే..ఓ సారి తప్పు చదివితే దాన్ని కరెక్ట్‌ చేసుకుని ఇంకెప్పుడూ అలా చదవకుండా ప్రోగ్రామింగ్‌ చేసుకోవచ్చు. అయితే…ఈ ంఎ యాంకర్‌ల వల్ల అసలు యాంకర్ల ఉద్యోగాలకు ఎసరు తప్పదేమో అన్న ఆందోళన మొదలైంది. ఇప్పటికే కొన్ని ఇండస్ట్రీల్లో మనుషులకు బదులుగా టెక్నాలజీయే అన్ని పనులు చక్కబెడుతోంది. మైక్రోసాఫ్ట్‌, ఐబీఎం, గూగుల్‌ లాంటి బడా కంపెనీలు ంఎ వచ్చాక కొంత మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ ఏడాది అమెరికాలో జరిగిన లేఆఫ్‌లకు 5% వరకూ ంఎ కారణంగా ఉంది. అలా అని అప్‌డేటెడ్‌గా లేకుంటే మార్కెట్‌లో అవుట్‌డేట్‌ అవుతాం కదా అని బదులిస్తున్నాయి ఆయా సంస్థలు. మొత్తానికి ప్రస్తుతానికి ంఎ యాంకర్ల ట్రెండ్‌ మాత్రం గట్టిగానే నడుస్తోంది. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....