ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్న 50 మంది మృతి

న్యూ డిల్లీ అక్టోబర్‌ 27 అక్టోబర్ 27 (ఇయ్యాల తెలంగాణ ):ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ ఇటీవలే మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ సైతం హమాస్‌పై ఎదురుదాడికి దిగింది. గాజా లోని హమాస్‌ స్థావరాలేలక్ష్యంగా భీకర దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల కారణంగా హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్న 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని హమాస్‌ తాజాగా వెల్లడిరచింది.కాగా, అక్టోబర్‌ 7నఇజ్రాయెల్‌పై మెరుపు దాడికి దిగిన హమాస్‌ మిలిటెంట్లు.. వందల మంది ప్రజలను బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. సుమారు 224 మందిని బందీలుగా చేసుకుంది. వీరిలో ఇజ్రాయెల్‌పౌరులతోపాటు ఇతర దేశాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారు. అందులో ఇద్దరు ఇజ్రాయెల్‌ మహిళలతోపాటు ఇద్దరు అమెరికన్లను మానవతా కోణంలో హమాస్‌ విడుదల చేసింది. కాగా, తాజాగా ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో 50 మంది ప్రాణాలు కోల్పోయినట్లు హమాస్‌ ప్రకటించింది.ఇక ఇజ్రాయెల్‌ దాడులతో గాజా గజగజ వణుకుతోంది. హమాస్‌ స్తావరాలే లక్ష్యంగా వైమానిక, భూతలదాడులకు పాల్పడుతోంది. ఈ దాడుల్లో సుమారు 7 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక విూడియా వెల్లడిరచింది. గురువారం ఉత్తర గాజాలో హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా భూతలదాడులు చేపట్టింది. సుమారు 250 మంది స్థావరాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....