ఇరాన్‌కు వార్నింగ్‌ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌

న్యూ డిల్లీ అక్టోబర్‌ 12 (ఇయ్యాల తెలంగాణ );ఇజ్రాయెల్‌ ? హమాస్‌ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. అయితే, హమాస్‌కు ఇరాన్‌ సహకారం అందిస్తుందనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇరాన్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. ఇజ్రాయెల్‌కు అమెరికా సైనిక సహాయం, అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలను మోహరిస్తున్నది. ఈ క్రమంలో ఇరాన్‌ను జాగ్రత్తగా ఉండాలని బైడెన్‌ హెచ్చరించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూతో బుధవారం మాట్లాడినట్లు తెలిపారు. యుద్ధ నిబంధనల ప్రకారం ఏవైనా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు.నెతన్యాహు 40 ఏళ్లుగా తనకు తెలుసునన్నారు. ఇజ్రాయెల్‌ కోపం, నిరాశ సమయంలోనూ యుద్ధ నిబంధనల ప్రకారం అడుగులు వేస్తుందన్నారు. హోలోకాస్ట్‌ తర్వాత యూదులకు ఇది అత్యంత ఘోరమైన ఘటన అని, ఇజ్రాయెల్‌ శక్తి మేరకు ప్రతిదీ చేస్తుందన్నారు. హమాస్‌ దాడులను అత్యంత క్రూరమైన చర్యగా అభివర్ణించారు. మరో వైపు అమెరికా పౌరులకు యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ట్రావెల్‌ అడ్వైజరీని జారీ చేసింది. గాజా వైపు వెళ్లొద్దని, ఈ విషయంలో జాగ్రత్త వహించాలని సూచించింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....