ఈనెల 15 నుంచి 23 వరకు తిరుపతి బ్రహ్మోత్సవాలు

 తిరుపతి అక్టోబర్‌ 4 (ఇయ్యాల తెలంగాణ );తిరుమలలో నిర్వహించనున్న శ్రీనివాసుడి నవరాత్రి బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను టీటీడీ వెల్లడిరచింది. ఈనెల 15 నుంచి 23 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల ఆరంభం నుంచి ముగింపు రోజు వరకు అష్టాదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేశారు.ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులను నిర్దేశిత వాహన సేవకు అనుతిస్తారు. 15న రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెద్ద శేష వాహనంపై శ్రీవారి ఊరేగింపుతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 23న శ్రీవారి చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయని టీటీడీ అధికారులు తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....