ఈ నెల 16నవిశాఖలో బీసీల మహా గర్జన

హైదరాబాద్‌  జూలై 3 ,(ఇయ్యాల తెలంగాణ ):వచ్చే `పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని, బి.సి లకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, బి.సి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లుపెట్టాలని, జనగణన లో కుల గణన చేయాలనీ డిమాండ్‌ చేస్తూ ఈ నెల 16న బీచ్‌ రోడ్డు  ఏయు కన్వర్షన్‌ విశాఖలో  బీసీ గర్జన సదస్సు ఏర్పాటు చేసినట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్‌. కృష్ణయ్య తెలిపారు. హైదరాబాద్‌ విద్య నగర్‌ బీసీ భవన్‌ లో విశాఖ బీసీ గర్జన పోస్టర్ని ఆర్‌ కృష్ణయ్య ఆవిష్కరించారు. ఈ సభకు జాతీయ బి.సి అధికార ప్రతినిధి, ఢల్లీి ఇంచార్జ్‌ కర్రి వేణుమాధవ్‌ అధ్యక్షతన జరుగుతుందని తెలిపారు.పార్లమెంటులో ప్రతిపక్షాలు కుల గణన పై మరియు  బీసీలకు చట్ట సభలలో రిజర్వేషన్లపై రాజ్యాంగబద్ధమైన హక్కులకై చర్చ జరపాలని కోరారు.  కుల గణన జరుపాలని 8 రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానాలు చేశాయి. 16 రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. వీరు పార్లమెంట్‌ ను స్తంబింప చేసి చిత్తశుద్ది నిరూపించుకోవాలి. రెండు రాష్ట్రాలకు చెందిన జూఖీఅఖ, ుఖీూ  ? కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యులు పార్లమెంటును స్తంభింప చేయాలని కోరారు. ఇతర సమస్యలపై రోజు పార్లమెంటులో ఉద్యమాలు చేస్తున్న మాదిరిగా కుల గణన పై కూడా పార్లమెంటులో చర్చ చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా జనగణన లో జరిగే అవకాశం ఉన్నా బీసీ వ్యతిరేక వైఖరితో డిమాండును అంగీకరించడం లేదన్నారు. పార్లమెంటును ప్రతిపక్షాలు స్తంబింప జేయాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ బి.సి కుల గణన పై ఇంతవరకు విధాన ప్రకటన జారి చేయలేదన్నారు.కార్యక్రమంలో బోను దుర్గ నరేష్‌ రాయుడు రాకేష్‌ (కాకా) పితాని హనిప్‌ చంద్ర  వేముల రామకృష్ణ, బిసి వెంకట్‌, ఆళ్ల రామకృష్ణ, శ్రీనివాస్‌, గోపి తదితరులు పాల్గొన్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....