ఈ నెల 20న హీరో ఆనంద్‌ దేవరకొండ ‘‘గం..గం..గణేశా’’ Trailer Release

యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘‘గం..గం..గణేశా’’. ప్రగతి శ్రీవాస్తవ, నయన్‌ సారిక హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై`లైఫ్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పతాకంపై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్‌ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్‌ దేవరకొండ తన కెరీర్‌ లో చేస్తున్న ఫస్ట్‌ యాక్షన్‌ మూవీ ఇది కావడం విశేషం.

ఈ నెల 31న ‘‘గం..గం..గణేశా’’ సినిమాను గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ అండ్‌ టైమ్‌ అనౌన్స్‌ చేశారు మేకర్స్‌. ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు ‘‘గం..గం..గణేశా’’ సినిమా ట్రైలర్‌ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. మంచి క్రైమ్‌ కామెడీ మూవీగా..ప్రేక్షకులు ఫ్యామిలీస్‌ తో కలిసి ఎంజాయ్‌ చేసేలా ఈ సినిమా ఉండబోతోంది.

నటీనటులు : ఆనంద్‌ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్‌ సారిక, కరిష్మా, వెన్నెల కిషోర్‌, సత్యం రాజేశ్‌, జబర్దస్త్‌ ఇమాన్యూయల్‌, రాజ్‌ అర్జున్‌, తదితరులు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....