ఈ నెల 20 న A.P. STUDY CIRCLE సివిల్‌ సర్వీసెస్‌, గ్రూప్‌ 1, 2 ACHING SCANNING TEST

తిరుపతి ఆగష్టు 19, ఇయ్యాల తెలంగాణ; ఆంధ్ర ప్రదేశ్‌ స్టడీ సర్కిల్‌ చే సివిల్‌ సర్వీసెస్‌ ,గ్రూప్‌ 1, గ్రూపు 2 కోచింగ్‌ కోసం దరఖాస్తు చేసున్నవారికి ఈ నెల 20న స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు , పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పక్కగా చేపట్టాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని  జిల్లా రెవెన్యూ అధికారి కోదండరామి రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్‌ లో ఎ.పి.స్టడీ సర్కిల్‌ సివిల్‌ సర్వీసెస్‌ , గ్రూప్‌ 1, 2 కోచింగ్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహణపై సంబందిత శాఖలతో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌.సి.వెల్ఫేర్‌ అధికారి చెన్నయ్య తో కలసి సవిూక్ష నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ రాష్ట్రం వ్యాప్తంగా నాలుగు చోట్ల నిర్వహణ వుందని తిరుపతి జిల్లా కేంద్రంగా 5 పరీక్షా కేంద్రాల్లో 2325 మంది ఈ అర్హత పరీక్ష వ్రాయనున్నారని, పరీక్షా సమయం ఆదివారం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందని అన్నారు. రాష్ట్ర పర్యవేక్షణ అధికారిని అన్నపూర్ణమ్మ, జిల్లా పర్యవేక్షణ అధికారి ఎస్‌.సి.వెల్ఫేర్‌ అధికారి చెన్నయ్య ని నియమించడం జరిగిందని అన్నారు. పరీక్షా కేంద్రాల్లో గంట ముందు నుండే  అనుమతి వుటుందని అభ్యర్థులు సకాలంలో చేరుకోవాలని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో హాల్‌ టికెట్‌ తో పాటు తప్పనిసరి ఫోటో ఐడి వుండాలని అన్నారు. ఈ అర్హత పరీక్ష వ్రాయడానికి పలు జిల్లాల నుండి రానున్నారని , ఎపిఎస్‌ఆర్టిసి రవాణా సౌకర్యం కల్పించాలని, పరీక్షలనిర్వహణ  సమయంలో విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలని, మెడికల్‌ క్యాంపుల ఏర్పాటు చూడాలని  అన్నారు.  పరీక్షా కేంద్రాలు : ఎస్‌.వి.ఆర్ట్స్‌ కళాశాల వింగ్‌ ‘‘ఎ’’ లో 600 మంది , వింగ్‌ ‘‘బి’’ లో 600 మంది, శ్రీ పద్మావతిమహిళా డిగ్రీ మరియు పి జి కళాశాల లో 600 మంది, శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాటశాల 300 మంది, ఎస్‌.వి.యునివర్సిటీ కాంపస్‌ హైస్కూల్‌ నందు 225 మంది అభ్యర్థులు ఈ అర్హత పరీక్ష వ్రాయనున్నారని వివరించారు. ఈ సవిూక్షలో పరీక్షా కేంద్రాల సూపర్వజర్లు , విద్యుత్‌ శాఖ డి ఇ శ్రీనివాసులు, ఆర్‌ టి సి ఎటిఎం డి ఆర్‌ నాయుడు , మెడికల్‌ ఆఫీసర్‌ ఉదయశ్రీ ,డి టి రామచంద్ర , పోలిస్‌ డిపార్ట్‌ మెంట్‌ బాలచంద్ర రాజు, ఎ ఎస్‌ ఓ లు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....