హైదరాబాద్, ఫిబ్రవరి 05 (ఇయ్యాల తెలంగాణ) : ఉత్పాదక రంగాలు పెరిగితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరామ్ పేర్కొన్నారు. తెలంగాణ జన సమితి పార్టీ ప్రధాన కార్యాలయంలో యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సలీం పాషా అధ్యక్షతన ” యువత ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన – పరిష్కార మార్గాలు ” అనే అంశంపై వర్క్ షాప్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న కోదండరామ్ మాట్లాడుతూ గత పదేళ్ల పాలనలో యువత నిరుద్యోగ సమస్యలు ఎదుర్కుంటు ఉపాధులు లేక తాగుడుకు బానిసలైనారన్నారు.మరి కొందరు యువకులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా సాంకేతిక విద్యను అభ్యసించి యువత నిలదొక్కు కోవాలన్నారు. అనంతరం రామానంద తీర్ధ గ్రామీణ ట్రైనింగ్ ఇన్సీట్యుట్ సంస్థ కి చెందిన మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషోర్రెడ్డి , ట్రైనింగ్ ఆఫీసర్ డాక్టర్ విహారి, రైతు స్వరాజ్య వేదిక కన్నేగంటి రవి లు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని ఉపాధి కల్పన పరిష్కార మార్గాలపై నిరుద్యోగ యువతకు మార్గ దర్శకాలు చేశారు. ఇంకా ఈ కార్య క్రమంలో ఎర్ర వీరన్న, కొత్త రవి జీవన్ రెడ్డి,కిరణ్ ముదిరాజ్ బాలకృష్ణ రెడ్డి, నవాజ్,స్వామి ముదిరాజ్, రాజు ముదిరాజ్, మధు, పాషా, కార్తీక్ రెడ్ఠి తదితరులు పాల్గొన్నారు.
- Homepage
- Telangana News
- ఉత్పాదక రంగాలు పెరిగితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి : Professor Kodanda Ram
ఉత్పాదక రంగాలు పెరిగితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి : Professor Kodanda Ram
Leave a Comment