హైదరాబాద్, జూలై 22, (ఇయ్యాల తెలంగాణ ):త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ సర్కార్. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల అధ్యయనం కోసం 2వ పీఆర్సీ ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పేందుకు రంగం సిద్ధం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల అధ్యయనం కోసం త్వరలోనే పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇంటెరిం రిలీఫ్ ళిఎఖీరి కూడా ప్రకటించనుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం ళిఇఊూరి పై కూడా నిర్ణయం తీసుకోవటంతో పాటు… ఈహెచ్‌ఎస్ అమలుకు విధి విధానాలు ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ హౌజింగ్ పై కూడా ప్రభుత్వం కీలక ప్రకటన ఇచ్చే ఛాన్స్ ఉందని… వారం, పది రోజుల్లో అన్ని ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అవుతారని తెలుస్తోంది.
- Homepage
- Telangana News
- ఉద్యోగులకు (2) PRC కమిషన్
ఉద్యోగులకు (2) PRC కమిషన్
Leave a Comment