ఉపాధ్యాయ నేస్తం ! – Upadhyaya Nestham

మాజీ ఎం.ఎల్. సి  కీ. శే. మార్పు బాలకృష్ణమ్మ 12వ వర్ధంతి సభ సందర్బంగా

ఉపాధ్యాయ నేస్తమా!ఆపన్న హస్తమా!

ఓర్పుకు సంకేతమా!’మార్పు’కు శ్రీకారమై!  llఉపాధ్యాయll

 

ఉపాధ్యాయ హక్కులకు నీవె ధాత

ప్రజాతంత్ర విద్యార్థి ఉద్యమ సంధాత 

బడుగులకై భూదానంచేసిన ప్రధాత 

ప్రజాస్వామ్య హక్కుల తెలిపిన నేత        ll ఉపాధ్యాయ ll

ప్రభుత్వ వ్యతిరేకత నాడు ప్రశ్నించినావు 

రైతాంగా పోరాటానికి బాసటగా నిలిచినావు 

ప్రజల తాగు నీటికి పోరు సలిపినావు 

రైతుల సాగునీటి సమస్య సాధించినావు   ll ఉపాధ్యాయ ll

దళితవర్గ పోరాటాలకు అండగ ఉన్నావు 

భూస్వామ్య పద్ధతి సమూలంంగ ఎండగట్టావు 

గిరిజనుల పోరుకు ఇతోధిక కృషి చేశావు 

నిరాడంబరతకు నీవె నిదర్శనమయ్యావు   ll ఉపాధ్యాయ ll

అణువంతైనా స్వార్థానికి తావివ్వలేదు 

కుట్ర కేసులకు ఇసుమంతైనా బెదరలేదు

విద్యాభివృద్ధికి చేసిన కృషి ఊరికే పోదు 

ఉపాధ్యాయులకు చేసిన మేలు మిమ్ము మరిచిపోదు ll ఉపాధ్యాయll

                             : రచన :      

             డాక్టర్ శ్రీవాటి శ్రీనాథ్ 

                     అధ్యక్షులు 

         డాక్టర్ విజయ భాస్కర్ 

            ప్రధాన కార్యదర్శి 

తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....