ఉస్మాన్ సాగర్ కు భారీగా వరద నీరు

హైదరాబాద్, జూలై 10 (ఇయ్యాల తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా వర్షం ఏకధాటిగా కురుస్తున్న కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు గేట్లు ఎత్తివేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే కుండపోత వర్షంతో నగరంతో పాటు శివారు ప్రాంతాలన్నీ నిండిపోయాయి. దీంతో పాటు ప్రధాన జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉస్మాన్ సాగర్లో ఇన్ ఫ్లో 100 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. దీంతో నీటి నిల్వ సామర్థ్యం ఉస్మాన్ సాగర్ లో 3.90 టీఎంసీ ల సామర్థ్యం హిమాయత్ సాగర్ కు నీటి నిల్వ సామర్థ్యం 2.90 టిఎంసి ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....