ఎండీ, సీఈవోను హతమార్చిన మాజీ ఉద్యోగి

బెంగళూరు  జులై 13, (ఇయ్యాల తెలంగాణ ):        బెంగళూరులో ఓ టెకీ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఏకంగా ఓ సాఫ్ట్‌ వేర్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎండీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సీఈవోను హత్య చేశాడు. ఇతను అదే కంపెనీలో గతంలో పని చేశాడు. ఈ మాజీ ఉద్యోగి వారి కార్యాలయంలోకి చొరబడి కత్తితో దాడి చేసి హత్య చేసినట్లుగా పోలీసు లు తెలిపారు.ఏరోనిక్స్‌ ఇంటర్నెట్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అయిన ఫణీంద్ర సుబ్రమణ్య, సీఈవో విను కుమార్‌ కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ, ఇద్దరూ మధ్యలోనే మృతి చెందారు. దాడి చేసిన వ్యక్తి ఫెలిక్స్‌ అని గుర్తించారు. అతను పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.దీనిపైవిచారణ చేపట్టారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....