ఎక్కడికెళ్లినా ఒకటే మాట వినిపిస్తోంది.. ! ఫిర్‌ ఏక్‌ బార్‌.. 400 పార్‌’ : PM Modi

👉 ఎక్కడికెళ్లినా ఒకటే మాట వినిపిస్తోంది.. అదే ఫిర్‌ ఏక్‌ బార్‌.. 400 పార్‌’

👉 మోడీ గ్యారెంటీపై ప్రజలకు నమ్మకం ఉంది.. అందుకు ఉదాహరణ సీఏఏ చట్టమే

👉 విపక్ష కూటమి ఓటు బ్యాంక్‌ రాజకీయం చేస్తోంది

👉 70ఏళ్లుగా హిందువులు, ముస్లింలు అంటూ విభజించి రాజకీయం చేశారు

 👉 విపక్షాలపై ఫైర్‌ అయిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ

అజాంఘర్‌ మే 16 (ఇయ్యాల తెలంగాణ) : పేదల అభివృద్ధి కోసం రాత్రి పగలు కష్టపడుతున్నానని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. విూ బాధలను ఒక్కొకటిగా తొలగిస్తున్నామని చెప్పారు. లోక్‌ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్‌ లో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. అజాంఘర్‌ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ‘ఎక్కడికెళ్లినా ఒకటే మాట వినిపిస్తోంది.. అదే ఫిర్‌ ఏక్‌ బార్‌.. 400 పార్‌’ అని చెప్పారు. దేశ ప్రజలంతా మోడీనే మళ్లీ ప్రధాని అంటున్నారని ఆయన చెప్పారు.మోడీ గ్యారెంటీపై ప్రజలకు నమ్మకం ఉందని.. అందుకు, సీఏఏ చట్టమే ఉదాహరణ అని ప్రధాని చెప్పారు. సీఏఏ కింద భారత్‌ పౌరసత్వం ఇవ్వడం ప్రారంభమైందన్నారు. దేశంలో వీరంతా చాలా ఏళ్లుగా శరణార్థులుగా ఉన్నారని చెప్పారు. మోడీ వెళ్తే సీఏఏ కూడా వెళ్తుందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. సీఏఏను ఎవరూ ఆపలేరన్నారు.

విపక్ష కూటమి ఓటు బ్యాంక్‌ రాజకీయం చేస్తోందని మోడీ విమర్శించారు. ఇండియా కూటమి పేదల రిజర్వేషన్లను ముస్లింలకు కేటాయిస్తామంటున్నారని.. మైనార్టీలకు బడ్జెట్‌ లో 50శాతం ఖర్చు చేస్తామంటున్నారని మండిపడ్డారు. 70ఏళ్లుగా హిందువులు, ముస్లింలు అంటూ విభజించి రాజకీయం చేశారని విపక్షాలపై ఫైర్‌ అయ్యారు. దేశమంతా  ఇప్పుడు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవంపై కూడా ఇండియా కూటమి విమర్శలు చేసిందని చెప్పారు. ప్రజలంతా బీజేపీ, ఎన్డీఏ కూటమితోనే ఉన్నారని.. మూడోసారి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రధాని మోడీ చెప్పారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....