ఎర్రచందనం స్మగ్లింగ్‌ వ్యవహారంలో పెద్ద తలకాయలను పట్టుకోవాలి.. డిప్యూటీ CM పవన్‌

అమరావతి,జులై 6 (ఇయ్యాల తెలంగాణ );అరుదైన ఎర్రచందనాన్ని విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న వ్యవహారంలో పెద్ద తలకాయలను పట్టుకోవాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నిరోధానికి నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. కడప జిల్లా పోట్లదుర్తి జగనన్న కాలనీలో ఎర్రచందనం డంపన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 158 దుంగలు దొరికాయని, వాటి విలువ రూ.1.6 కోట్లు ఉంటుందని అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. శేషాచలం అడవుల్లో నరికేసిన ఎర్రచందనం దుంగలను ఎక్కడెక్కడ దాచారో గుర్తించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లర్ల నెట్వర్క్ను నడిపిస్తున్న సూత్రధారులను పట్టుకోవాలని నిర్దేశించారు. రవాణా దశలో,దాచి ఉంచిన దగ్గరో పట్టుకోవడంతో పాటు ఎర్రచందనంకూలీలు, రవాణా దారులను తెరవెనుక ఉండి నడిపిస్తున్నవాళ్లను గుర్తించి అరెస్టు చేయాలన్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలపై చర్చించారు. నమోదైన కేసుల్‌ రాష్ట్రాలు, నేపాల్లో పట్టుబడ్డ కేసుల్లో అక్కడ ఉండిపోయిన ఎర్రచందనం దుంగలను తిరిగి తెచ్చుకోవడంపైనా దృష్టి పెట్టాలన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....