ఎలక్ట్రానిక్‌ Voting మిషన్లపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం

తుగ్గలి, జనవరి 23 (ఇయ్యాల తెలంగాణ) : త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లా స్థాయి అధికారుల ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఈవీఎం) పై రెవెన్యూ అధికారులు ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ అవగాహనకార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన తుగ్గలి లోని పోలింగ్‌ బూత్‌ 108, 109,110 మరియు 111 సెంటర్ల యందు విఆర్‌ఓ రహిమాన్‌ ఈవీఎం మిషన్లపై ఓటర్లకు అవగాహన కల్పించారు.రాబోయే సార్వత్రిక ఎన్నికలలోఅధికారులు తెలియజేసిన సూచనల ప్రకారం ఓటర్లు ఓటు వేయాలని వీఆర్వో రహిమాన్‌ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాజు,రెవెన్యూ కార్యాలయ సిబ్బంది నెట్టికంటయ్య,గ్రామ ప్రజలు తదితరులుపాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....