ఒంటి చేత్తో దేశాలను పాలిస్తున్న మహిళా నాయకులు

న్యూ డిల్లీ సెప్టెంబర్‌ 21 (ఇయ్యాల తెలంగాణ ): తొమ్మిది నెలలలో ఓ బిడ్డకు ప్రాణంపోయగల శక్తి స్త్రీకి ఉంది. కానీ, చట్టసభలలో ఆమె ప్రాతినిధ్యానికి ఉద్దేశించిన బిల్లు మాత్రం మూడు దశాబ్దాలు గడిచినా చట్టరూపం దాల్చలేదు. మొత్తానికి గ్రహణం వీడిరది. లోక్‌సభ ఆమోదం పొందింది. అయినా, మహిళ పాలన మనకు కొత్తేం కాదు. తరాలుగా తన నాయకత్వ ప్రతిభను నిరూపించుకుంటూనే ఉన్నదామె. స్వాతంత్య్రం తర్వాత ఏర్పడిన మొట్టమొదటి క్యాబినెట్‌లో మంత్రిగా కొలువైన అమృత కౌర్‌ నుంచి ఇప్పటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరకు చాలామంది మగువలు దేశానికి ప్రాతినిధ్యంవహించారు. ఇక విశ్వ మహిళలు ఇందిరాగాంధీ, మార్గరెట్‌ థాచర్‌, అంగ్‌సాన్‌ సూకీ, బెనజీర్‌ భుట్టో తమదైన ముద్రతో అంతర్జాతీయ సమాజాన్ని ప్రభావితం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా దేశాధ్యక్షులను కూడా తలుచుకుని తీరాలి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....