ఒక్క నెలలోనే BJP కి ‘అపరిచితుడు’ సినిమా చూపించిన కోమటిరెడ్డి

హైదరాబాద్‌ అక్టోబర్‌ 27 (ఇయ్యాల తెలంగాణ ):మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌ నీలో.. కమల్‌ హాసన్‌’ డైలాగ్‌ బాగా ఫేమస్‌… ఇప్పుడు సోషల్‌ విూడియాలో ఈ పొలిటికల్‌ సర్కిల్‌లో ఈ డైలాగ్‌ను కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి వాడుతున్నారు. అంతేకాదు.. ఒక్కనెలలోనే బీజేపీకి ‘అపరిచితుడు’ సినిమా చూపించాడంటూ నేటిజన్స్‌ పేర్కొంటున్నారు. ఇందుకు ఈ నెలలో జరిగిన పరిణామాలే నిదర్శనమని అంటున్నారు.అక్టోబర్‌ 5 న కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిఒక పెద్ద లేఖను విడుదల చేశారు. ఇందులో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని విడిచిపెట్టేది లేదనిపేర్కొన్నారు. అంతేకాదు.. బీజేపీ ముఖ్య నేతలెవరూ పార్టీని వీడరంటూ అభయంఇచ్చేశారు.అక్టోబర్‌6న బీజేపీ అధిష్టానం కోమటిరెడ్డికి స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవి ఇచ్చింది. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నెరవేర్చుతానని, నమ్మకాన్ని నిలబెట్టుకుంటానంటూ ఆ రోజువిూడియా ముఖంగా చెప్పారు.అదేరోజు బీజేపీ నిర్వహించిన రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్నారు.అక్టోబర్‌ 16న చౌటుప్పల్‌లో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు.ఇన్ని చెప్పిన రాజగోపాల్‌ రెడ్డి గతవారం రోజులుగా తనలోని అపరిచితుడిని బయటికి తీశారు. క్రమంగా పార్టీకి దూరంగా ఉంటూ.. ఢల్లీి కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. విమానం ఎక్కి ఢల్లీికి వెళ్లి చర్చలు జరిపి వచ్చేశారు. ‘త్వరలో నిర్ణయంతీసుకుంటా’ అంటూ దసరానాడు బాంబు పేల్చాడు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు రెండు రోజుల కిందట ప్రకటించారు. ఈ పరిణామాలు చూసిన రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు.రాజగోపాల్‌రెడ్డి స్థాయి ఉన్న నేతలు సాధారణంగా పార్టీ మారే నిర్ణయంపై కనీసం నెలరోజులపాటు చర్చ లు జరుపుతారని చెప్తున్నారు. అంటే.. అక్టోబర్‌ మొదలయ్యేనాటికే ఆయన పార్టీ మారాలని ఫిక్స్‌అయ్యారంటున్నారు. అయినా పైకి కనిపించకుండా ఏకంగా రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొని, పార్టీ కార్యాలయాలను ప్రారంభించడం వంటివన్నీ చూస్తుంటే బీజేపీకి ‘అక్టోబర్‌లో అపరిచితుడు’ అనేసినిమా చూపించారంటూ ఎగతాళి చేస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....