హైదరాబాద్, జూలై 13, (ఇయ్యాల తెలంగాణ) :ఫోన్ వస్తే చాలు.. అక్కడి ప్రజా ప్రతినిధులు హడలెత్తిపోతున్నారు. ఫోన్ రింగ్ టోన్ వారి గుండేల్లో.. భయం గంట మోగిస్తోంది. ఒక్కసారి ఫోన్ ఎత్తితే.. గంట తిరిగే సరికి సోషల్ విూడియాలో ప్రత్యక్షమవుతుందట. చేతిలో ఫోన్ ఉంది కదా అని ఎడా పెడా మాట్లాడి అడ్డంగా బుక్ అవుతున్నారు. ఆ కాల్ రికార్డింగ్లు బయటకు వచ్చి వారిని వ్యక్తిగతంగా వేధించడమే కాదు.. పదవులకే ఎసరు తీసుకువచ్చేలా ఉందంటూ లబోదిబోమంటున్నారు.. పలువురు ప్రజాప్రతినిధులు.. ఈ పొలిటికల్ క్రైమ్ కథా చిత్రమ్ ఎక్కడిదో కాదు.. మన హైదరాబాద్ నగర కహానీనే..హైదరాబాద్ ఓల్డ్ సిటీ.. మాస్ ఏరియా అడ్డా. టైంపాస్ బ్యాచ్ లతో చార్మినార్ గల్లీలన్ని హౌస్ ఫుల్. రాత్రంతా పిచ్చాపాటి ముచ్చట్లే. ఖాళీ దొరికితే చాలు బాతాఖానితో కాలం వెళ్లదీస్తారు. ఇలాంటి కొన్ని బ్యాచ్లు.. హైప్రొఫల్ క్యాండెట్ లను టార్గెట్ చేస్తున్నాయి. ఫోన్ చేసి మరి రికార్డింగ్.. ట్యాపింగ్ కు పాల్పడుతోంది. ఇలా ఓ గ్యాంగ్ వేళాపాళ లేకుండా ప్రజా ప్రతినిధులకు ఫోన్స్ చేసి సమస్యలు విన్నవిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం, ప్రజలకు ఇచ్చిన హావిూ ఏమైందని వేధిస్తోంది. వాళ్లు మాట్లాడిన మాటలను రికార్డ్ చేసిన అనంతరం సోషల్ విూడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తోంది.ఇక ఆ ఆడియో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సీన్ రివర్స్ అయి.. సితార్ అవుతోందని ప్రజాప్రతినిధులు లబోదిబోమంటున్నారు.. అలా బయటికి వచ్చిన ఆ ఆడియో విన్న నెటిజన్లు సెటైర్లతో కామెంట్ బాక్స్ ను తెగ నింపేస్తున్నారు. దీంతో నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వెళ్తుంది.
ఫోన్ చేస్తే కోప్పడుతారన్న చెడ్డ పేరు కూడా పెద్ద లీడర్లకు వెంటాడుతోంది. ఈ ఎఫెక్ట్ ఎన్నికల సర్వేలో అటో.. ఇటో.. అని తేలుతుందని నెత్తిబాదుకుంటున్నారు.ఈ ఫీడ్ బ్యాక్.. ఫలానా ప్రజాప్రతినిధి గురించి ప్రజలు ఇలా మాట్లాడుకుంటున్నారంటూ హైకమాండ్ కు వెళ్తుందని.. దీంతో వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వాలా..? వద్దా..? అన్న ఆలోచనలో పార్టీ పెద్దలు ఉండే అవకాశం ఉందని నాయకులు తెగ మదనపడుతున్నారు.. అయితే, కొంత మంది చేసే కాల్స్ తమ నెత్తివిూదకు తీసుకువస్తాయని చివర వరకు వాళ్లు కూడా ఊహించలేకపోతున్నామని.. అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని నాయకులు బాహటంగా మొత్తుకుంటున్నట్లు పేర్కొంటున్నారు.పేరు మోసిన లీడర్లు.. కొత్త కొత్త ఫోన్ నెంబర్లతో ఫోన్ వస్తే.. ఫోన్ ఎత్తడానికి వంద సార్లు ఆలోచిస్తున్నట్లు సమాచారం.. ఇలాంటి ఫేక్ కాల్స్ పై గతంలో చాలా మంది ఫిర్యాదు చేశారు. దీంతో పలువురిపై కేసులు సైతం నమోదయ్యాయి. అయితే, ఇప్పుడు మళ్లీ ఇప్పుడు స్టార్ట్ అవ్వడంతో.. పొలిటికల్ కెరీర్ కు ఎక్కడ స్టాప్ పడుతుందోనని.. మదనపడుతున్నారు.. ఏదీఏమైనా.. ఈ నయా.. ఫోన్ పొలిటికల్ క్రైమ్ కథా చిత్రమ్.. ఇప్పడు పాతబస్తీలో తెగ హాట్ టాపిక్ గా మారింది.