కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన MLAరాజయ్య

  
స్టేషన్‌ ఘన్‌ పూర్‌ సెప్టెంబర్ 22 (ఇయ్యాల తెలంగాణ );స్టేషన్‌ ఘన్‌ పూర్‌ లో పార్టీ టికెట్‌ ప్రకటించిన కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు అందించి, పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజయ్య ప్రకటించారు.  శుక్రవారం నాడు ఈరోజు ప్రగతి భవన్లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్‌ లీడర్లతో జరిగిన సమావేశం అనంతరం రాజయ్య పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. శ్రీహరి  గెలుపు కోసం పాటుపడతానని తెలిపారు. పార్టీ రాజయ్య భవిష్యత్తుకు అండగా ఉంటుందని, ఆయనకు సముచితమైన స్థానం కల్పిస్తుందని సమావేశంలో ఎమ్మెల్యే రాజయ్యకు మంత్రి కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. పార్టీ నిర్ణయం మేరకు తనకు సంపూర్ణ మద్దతు తెలిపిన రాజయ్యకు,  పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు. స్టేషన్‌ ఘన్పూర్‌ నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....