” కరివేపాకుతో ఆరోగ్యం – అందం ” Health and Beauty in Curry Leaves

కరివేపాకు ను మనం సాధారణంగా తీసి పారేస్తుంటాం కేవలం పప్పులో వేసుకొని రుచి కోసం మాత్రమే కరివేపాకును ఉపయోగిస్తామే తప్ప వాటిలో ఉన్న అనేక ఔషధ గుణాలు శరీరానికి రక్షణానదించే వివిధ రకాల ఔషధ గుణాలను అసలు గుర్తించలేక పోతున్నాము. కరివేపాకు లో మోహినీంబిన్ అనే కెమికల్ ఉంటుంది. దీని ద్వారా రక్తంలో కొలస్ట్రాల్ తగ్గించడానికి కొవ్వును తగ్గించడానికి ఈ కెమికల్ ఉపయోగ పడుతుంది.పంజాబ్ పరిశోధన శాల  జాతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ సెంటర్ ద్వారా నిరూపించడం జరిగింది. రక్తంలో ఉండే  ఔషధ గుణాలతో కొలెస్ట్రాల్ ని తగ్గించడంతో పాటు ట్రై గ్లిసరైజ్డ్ ద్వారా గుండె జబ్బులు వచ్చే ప్రమాద మున్నందున మోహినీంబీన్ ద్వారా ప్రధానంగా వీటిని అరికట్టే లక్షణాలు కరివేపాకులో ఉన్నందున ఇన్ఫెక్షన్ రాకుండా రక్షణ కవచంగా ఉపయోగ పడుతుంది. 

👉 విటమిన్ ” ఏ ” అధికంగా అందిస్తుంది. 

👉 రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. 

👉 ఇందులో ఉండే ట్రై గ్లిజరిన్ ద్వారా గుండె జబ్బలను నివారిస్తుంది. 

👉 మెదడు సంబంధిత వ్యాధుల నివారణకు సహకరిస్తుంది. 

👉 అనేక పరిశోధనల్లో కరివేపాకు తో అనేక రకాల ఇన్ఫెక్షన్ రాకుండా నివారిస్తుంది. 

👉 కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నందున మతిమరుపు రాకుండా   

       ఉండడంలో ఉపయోగ పడుతుంది.  

👉 లిని లాల్, ఆల్ఫా టర్ఫీనిన్, మెర్సీన్ , ఆల్ఫా పీనిన్ అనే 4 రకాల ఔషధ గుణాలతో  

       ఉన్నందున  శరీరం  జబ్బుల బారిన పడకుండా తోడ్పాటు నందిస్తుంది. 

ప్రపంచంలోని అనేక పరిశోధనాలయాలు కరివేపాకు మీద వివిధ పరిశోధనలతో ఎన్నో లాభాలు ఉన్నట్లు గుర్తించారు. అందుకే కరివేపాకును మీకు కావలసినట్లుగా ఉపయోగించి వాటి ఫలితాలు పొందగలరు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....