కలవరపెడుతున్న కాంగ్రెస్‌ Self Declaration

వరంగల్‌, సెప్టెంబర్‌4, (ఇయ్యాల తెలంగాణ) : కాంగ్రెస్‌లోని ఆశావహుల్లో సెల్ఫ్‌ డిక్లరేషన్‌ టెన్షన్‌ మొదలైంది. టికెట్‌ రాకపోతే పక్క పార్టీకి వెళ్లేందుకు కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిరది. పార్టీ పెట్టిన కొత్త రూలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ దరఖాస్తుకు ఓ సెల్ఫ్‌?డిక్లరేషన్‌ ను ప్రకటించింది. 17 కీలక అంశాలను అందులో పొందు పరిచింది. ‘రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించకపోతే.. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నామినేషన్‌ దాఖలు చేయను’ అనే నిబంధన డిక్లరేషన్‌ లో కీలకంగా మారింది. పార్టీకి లిఖిత పూర్వకంగా హావిూ ఇచ్చారు. మరి పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే హైకమాండ్‌ నుంచి ఎలాంటి చర్యలు ఉంటాయోనని చాలామంది నేతలు మదన పడుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగినందునే 119 నియోజకవర్గాలకు 1006 అప్లికేషన్లు వచ్చినట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఒక్కో సెగ్మెంట్‌ కు సగటున 8 నుంచి 9 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపిక కూడా ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్‌ కమిటీలకు సవాల్‌ గా మారింది. సీనియర్లు, మాజీ ఎమ్మెల్యేలకు రూట్‌ క్లియర్‌ అయినా చాలాకాలంగా ఎదురు చూస్తున్నవారు, కొత్తవాళ్లకు ఇబ్బందికర పరిస్థితి ఉంది.జనాల్లో తిరుగుతూనే, టీపీసీసీ, ఏఐసీసీ నేతలను ప్రసన్నం చేసే పనిలోనూ కొందరు నేతలు నిమగ్నమయ్యారు. అయితే టికెట్‌ రాకపోతే పక్క పార్టీలోకి దూకాలని చూసే నేతలూ ఉన్నారు. రూల్స్‌ బ్రేక్‌ చేస్తే పార్టీ నిర్ణయం ఎలా ఉండవచ్చు..? లీగల్‌ సమస్యలు తలెత్తుతాయా? ఎలాంటి స్టెప్‌ తీసుకోవచ్చు..? అంటూ చాలామంది లీగల్‌ అడ్వయిజర్ల సలహాలు తీసుకోవడం గమనార్హం. నిబంధనల మేరకే పొందుపరిచారా? లేదా సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ను స్ట్రిక్ట్‌ గా అమలు చేస్తారా అనేది త్వరలో తేలనున్నది.

దరఖాస్తులోని అంశాలు ఇవే..

1. మానవ, స్త్రీల గౌరవాన్ని నిలబెడతాను. శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహిస్తాను.

2.మహిళల పట్ల వివక్ష నిర్మూలన కోసం కృషి చేస్తాను.

3. ఎన్నికల తేదీ నుంచి 3 నెలల వ్యవధిలో ఆస్తి రిటర్నులను, ప్రతి ఏడాది ఆస్తులు తదితర వివరాలను సమర్పిస్తాను.

4. బలహీన వర్గాలకు ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలను నిర్వహిస్తాను.

5. అల్లర్లు లేదా ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను కాపాడడానికి సహాయం అందిస్తాను.

6.కాంగ్రెస్‌ కార్యకర్తగా విధులను నిర్వర్తించడంలో వ్యక్తిగత ప్రయోజనాలను మినహాయిస్తాను. ప్రజా, జాతీయ ప్రయోజనాలను ప్రోత్సహిస్తాను.

7. ఏ క్రిమినల్‌ ఎలిమెంట్‌ తోనూ సంబంధాన్ని కలిగి ఉండను.

8. పన్నులు, ప్రభుత్వం పార్టీకి అందించాల్సిన బకాయిలను ఎప్పటికప్పుడు చెల్లిస్తాను.

9. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తాను.

10. జాతీయ సమైక్యత, సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించే అన్ని వర్గాల ప్రధాన పండుగల్లో పాల్గొంటాను.

11. సంపద అతి ప్రదర్శనకు దూరంగా ఉంటాను.

12. కట్నం తీసుకోను, ఇవ్వను.

13. కాంగ్రెస్‌ అధ్యక్షుడు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం తప్ప, పార్టీ తరపున నిధులను సేకరించను.

14. ప్రజలను కలిసేందుకు వెళ్లేప్పుడు పీసీసీ, డీసీసీకి సమాచారం ఇస్తాను.

15. పార్టీ విధానాలు, కార్యక్రమాలు, ఇతర పార్టీ సభ్యుల పరువు, ప్రతిష్టను తగ్గించే విధంగా బహిరంగంగా విమర్శించను.

16. కుల, మత, ఆధారిత రాజకీయ సంస్థలతో అనుబంధం కలిగి ఉండను.

17. పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించని పక్షంలో, పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్‌ దాఖలు చేయనని డిక్లేర్‌ చేస్తున్నాను.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....