హైదరాబాద్, జనవరి 27 ఇయ్యాల తెలంగాణ : రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్ జిల్లాలోని ఉత్తమ ఉద్యోగులకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రశంస పత్రాలను అందజేశారు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు విధి నిర్వహణలో ఉత్తమ సేవలను అందించినందుకు ప్రశంసా పత్రాలను అందించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లా సైన్సు అధికారి సీ ధర్మేందర్ రావ్ కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందు కున్నారు. విద్యాశాఖ సైన్సు అధికారిగా ధర్మేందర్ సేవలపై పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాకాధికారిణి ఆర్ రోహిణి ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.